హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాన్ సూసైడ్స్‌కు బ్రేక్... సరికొత్త పరిష్కారం

|
Google Oneindia TeluguNews

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండుప్రాణాలు బలిగొంటున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందనే విషయం మరచిపోయి చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు సైతం బెదిరిపోయో, కుంగిపోయో అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఈక్రమంలో ఆత్మహత్యల నివారణకు ఓ విద్యార్థి కనుగొన్న పరిష్కారం ప్రశంసలు అందుకుంటోంది.

జీవితం చాలనుకుని ఇంట్లోనే చాలామంది ఆత్మహత్యలకు సిద్ధపడుతుంటారు. సూసైడ్ అనగానే వారికి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కనిపిస్తుంది. ఎవరికీ తెలియకుండా గదికి గడియ వేసి ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నారు. ఇలాంటి ఫ్యాన్ సూసైడ్ అటెంప్ట్ లకు చెక్ పెడుతూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వెంకటేశ్ సరికొత్త ఆవిష్కరణకు తెరతీశాడు.

 suicide prevent device discovered by a student appreciated

నవాబ్ పేట మండలం యన్మనగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న వెంకటేశ్.. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఈ పరికరం ప్రశంసలు అందుకుంటోంది. ఆత్మహత్యలు నివారించడానికి తనవంతు ప్రయత్నంగా ఈ పరికరం రూపొందించాడు. సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు.. దానికి ఓ స్ప్రింగ్ ఏర్పాటు చేశాడు. దీంతో ఆ ఫ్యాన్ కు ఉరివేసుకోవాలని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బరువుతో స్ప్రింగ్ కిందకు సాగడంతో సూసైడ్ అటెంప్ట్ విఫలమవుతుంది.

English summary
Venkatesh, a student of Mahaboobnagar district, discovered the new innovation. He designed the device as an attempt to prevent suicide. When a ceiling fan fits it, it has a spring. So if someone try to hang on to the fan, the suicide attempt will fail because the spring moves down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X