హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎండల ఎఫెక్ట్ చూశారా.. ? బాబోయ్.. ఆమ్లెట్, దోశలే కాదు.. బజ్జీలు కూడా..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎండలు మండుతున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 10 దాటితే చాలు జనం ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఇక మధ్యాహ్నం బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎండ చంపేస్తోంది బాబోయ్ అనే రీతిలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. వాటితో ఎండ తీవ్రతను అంచనా వేయొచ్చంటే అతిశయోక్తి కాదు.

ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)

మండుటెండలకు జనాలు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. 45 డిగ్రీలు దాటి టెంపరేచర్ దంచి కొడుతుందనే వార్తల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. అయితే భానుడి ప్రతాపానికి నిదర్శనంలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు బాగా వైరలవుతున్నాయి.

అందులో ఒకటి మాత్రం బాగా హైలైట్ అవుతోంది. మూకుడులో నూనె వేసి కాసేపు ఎండలో ఉంచితే ఎంచక్కా బజ్జీలు వేసుకునే లెవెల్లో ఎండలు కొడుతున్నాయని ఆ వీడియో సారాంశం. అయితే నిజంగా ఎండ వేడికే నూనె కాగిందా?.. లేదంటే ముందే నూనె వేడి చేసి అలా కావాలని వీడియో తీశారా అనేది కచ్చితంగా చెప్పలేమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

summer heat effect too much hot
English summary
Summer Season is very hot. The public doesn't came outside in afternoon time because of heat. some of videos going viral in social media how the heat raising.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X