హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయారెడ్డి ఉదంతంలో మరో విషాదం...పెట్రోల్ పోసిన సురేష్ మృతి

|
Google Oneindia TeluguNews

ఒక్క భూమి పట్టా వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగోంది. అప్పుల్లో కూరుకుపోయి అనాలోచితంగా వ్యవహరించిన సురేశ్ తీరుకు తన స్వంత కుటుంబంతో పాటు మొత్తం మూడు కుటుంబాల భవిష్యత్ చిద్రమైంది. ఈనేపథ్యంలోనే అబ్దుల్లా‌పూర్ మెట్ సంఘటనలో తహసీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ అనే రైతు పెట్రోల్ పోయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తాజాగా తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి గాయాలపాలైన సురేశ్ సైతం గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు మృతి చెందాడు. ఇక మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ గుర్నాథం రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.

తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్ ... విజయారెడ్డి హత్య కు సురేష్ రెక్కీ , హత్య వెనకాల వారి హస్తం ?తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్ ... విజయారెడ్డి హత్య కు సురేష్ రెక్కీ , హత్య వెనకాల వారి హస్తం ?

 విజయారెడ్డి ఘటనలో నలుగురికి గాయాలు

విజయారెడ్డి ఘటనలో నలుగురికి గాయాలు

నవంబర్ మూడున మధ్యాహ్నం తహాసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమె మంటల్లో చిక్కుకుని బయటకు అరుచుకుంటూ వచ్చింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ గుర్నాథంతో పాటు , అటెండర్ చంద్రయ్య, వ్యక్తిగత పనిమీద కార్యాలయానికి వచ్చిన నారాయణ అనే మరో వ్యక్తితో పాటు మొత్తం ముగ్గురు మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాల పాలయ్యారు. ఇక తహాసీల్దార్‌పై పెట్రోల్ పోసిన అనంతరం మంటల్లో చిక్కుకున్న సురేశ్‌కు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. మొత్తం 65శాతానికి పైగా గాయాలు అయినట్టు వైద్యులు తెలిపారు...అయినా సురేశ్ సంఘటన అనంతరం తాపిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఎసీ పేలిందంటూ బయటకు వెళ్లిపోయాడు.

 డ్రైవర్ గుర్నాథం మృతి.. మరో ఇద్దరు చికిత్స

డ్రైవర్ గుర్నాథం మృతి.. మరో ఇద్దరు చికిత్స

ఇక గాయపడ్డ నలుగురిలో డ్రైవర్ గుర్నాథంకు ఎనబై శాతం గాయాలు అయ్యాయి. దీంతో సంఘటన అనంతరం రెండు రోజుల పాటు డీఆర్డీఏ ఆసుపత్రిలో చికిత్స పోందాడు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పోందుతూనే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఇక ఇదే కేసులో గాయపడ్డ చంద్రయ్యతో పాటు నగరశివారులోని కవాడిపల్లికి చెందిన బోడిగ నారాయణ గౌడ్‌లు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. వీరికి నలబై శాతం మేర గాయాలు అయినట్టు వైద్యులు తెలిపారు.

 చికిత్స పొందుతూ సురేశ్ మృతి

చికిత్స పొందుతూ సురేశ్ మృతి


తహాసీల్దార్‌పై పెట్రోల్ పోసి తాను సైతం తీవ్రగాయలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సురేష్ నేడు మధ్యాహ్నం 3.30కి మృతి చెందినట్టు ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. కాగా విజయారెడ్డిపై దాడి చేసిన అనంతరం తనపై కూడ పెట్రోల్ పోసుకుని మంటల్లో గాయపడిన సురేష్ నేరుగా నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో... తీవ్రగాయాలతో ఉన్న సరేశ్‌ను స్థానిక డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. మరోవైపు సురేశ్ ఉదయమే చనిపోయాడనే వార్తలు దావానంలా వ్యాపించాయి. అయితే వీటిని ఉదయం ఉస్మానియా వైద్యులు ఖండించారు.

English summary
suresh who accused in Abdullapur Met Tahsildar Vijaya Reddy murder case has died at 3.30 pm while taking treatment in osmania hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X