• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించి..హైద‌రాబాద్ పోలీసులను చిత‌గ్గొట్టిన జ‌నం

|

హైద‌రాబాద్/భువ‌నేశ్వర్‌: హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసుల‌పై ఒడిశాలో దాడి జ‌రిగింది. స్థానికులు పోలీసుల‌పై దాడికి దిగారు. కారును ధ్వంసం చేశారు. అద్దాల‌ను ప‌గుల గొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 10 మంది వ‌ర‌కు సిటీ పోలీసులు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా నిందితుల‌ను అరెస్టు చేయ‌డానికి పోలీసులు అక్క‌డికి వెళ్ల‌గా.. స్థానికులు ఏక‌మై వారిపై దాడి చేశార‌ని, ముష్టిఘాతాలు కురిపించార‌ని స‌మాచారం. పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లడానికి వ‌చ్చిన ముఠాగా అనుమానించి, పోలీసుల‌ను చిత‌గ్గొట్టారు. ఒడిశాలోని గంజాం జిల్లా స‌న‌ఖేముండి పాట్‌పురా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని డెంగాడి గ్రామంలో గురువారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వ‌ణికిస్తోన్న వింత వ్యాధి: తొలి కేసు న‌మోదు!

Suspecting Child-Theft, Ganjam Villagers in Odisha Beat Up Telangana Police

హైద‌రాబాద్ పంజాగుట్ట స‌మీపంలోని ఓ న‌గ‌ల దుకాణంలో బంగారు ఆభ‌ర‌ణాల చోరీ కేసు న‌మోదైంది. షాపు య‌జ‌మాని కొంద‌రు ఒరియాల‌పై అనుమానాలు వ్య‌క్తం చేశారు. కాల్ డేటా ఆధారంగా వారిని గుర్తించారు పోలీసులు. గంజాం జిల్లా డెంగాడి గ్రామంలో త‌ల‌దాచుకున్న‌ట్లు తేలింది. దీనితో 10 మంది పోలీసుల బృందం నిందితుల కోసం ఓ కారులో డెంగాడి గ్రామానికి బ‌య‌లుదేరింది. ఈ ఉద‌యం పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. నిందితుల‌ను గుర్తించి, వారు త‌ల‌దాచుకున్న ఇంటిపై దాడి చేశారు. నిందితుల‌ను ఇళ్ల నుంచి రెక్క‌లు ప‌ట్టుకుని బ‌య‌టికి తీసుకొచ్చారు. ఇక్క‌డే వారు ఓ పొర‌పాటు చేశారు. ఆ స‌మ‌యంలో వారు మ‌ఫ్టీలో ఉన్నారు. కొంద‌రు పోలీసులు టీష‌ర్ట్‌ను ధ‌రించి ఉన్నారు.

Suspecting Child-Theft, Ganjam Villagers in Odisha Beat Up Telangana Police

దీనితో వారిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులుగా అనుమానించారు డెంగాడి గ్రామ‌స్తులు. చిన్న పిల్ల‌ల‌ను ఎత్తుకుని వెళ్లే వారిగా నిర్ధారించుకున్నారు. దాడికి దిగారు. పోలీసులను చుట్టుముట్టి, ముష్టిఘాతాలు కురిపించారు. తాము పోలీసుల‌మ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. స్థానికులు వినిపించుకోలేదు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ప‌లువురికి ముఖంపై గాయాలైన‌ట్లు తెలుస్తోంది. పోలీసుల కారును కూడా ధ్వంసం చేసి ప‌డేశారు. కారు అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. ఆ స‌మ‌యంలో పోలీసుల యూనిఫాం కారులో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Suspecting Child-Theft, Ganjam Villagers in Odisha Beat Up Telangana Police

స‌మాచారం అందుకున్న వెంట‌నే పాట్‌పురా పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్ర‌శ్నించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీనితో వారిని స‌న‌ఖేముండి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు అక్క‌డ చికిత్స పొందుతున్నారు. పోలీసుల‌పై దాడి చేసిన స్థానికుల్లో కొంద‌రిని పాట్‌పురా పోలీసులు అదుపులోకి తీసుక‌న్న‌ట్లు తెలుస్తోంది.

English summary
In a shocking incident, villagers of Dengadi under Patpur police limits in Sanakhemundi area here allegedly thrashed Telangana cops on child-theft suspicion. Reportedly, a team of cops from Hyderabad were investigating a suspected criminal in the village. As they had been visiting the area for several days in plain clothes, villagers suspected something fishy.Child-theft being a common occurence in the area, the locals started questioning the 'strangers' in the area and began thrashing them. They also ransacked the police van.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more