హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు టీ అసెంబ్లీ ఆమోదం..! భట్టికి గట్టి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2019 కి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సీఎం చంద్రశేఖర్ రావు సభలో ప్రవేశపెట్టగా... శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, అభివృద్ధి క్రమపద్ధతిలో జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువస్తున్నామని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు . పురపాలక ఎన్నికలు జరపాలనే సంకల్పంతోనే ఈ బిల్లును తీసుకువస్తున్నాం. .

త్వరలోనే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 2 వేల 74 కోట్ల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకువస్తున్నామని ఇది సభ్యులకు, ప్రజలకు తెలుసని అన్నారు. అనేక విభాగాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.

T Assembly passes municipal law amendment bill.! KCR gave a counter to Bhatti..!!

పదిగా ఉన్న జిల్లాలను 33 జిల్లాలను చేశాం. 5వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 65 మున్సిపాలిటీల ఉండే. ఇప్పుడు 142 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలన్నా.. శాసనసభ ఆమోదించాల్సిందే. ప్రగతి నిరోధక శక్తులు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందాక..సభ రేపటికి వాయిదా పడింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో కలుపుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. అయితే భట్టి వ్యాఖ్యలకు సీఎం చంద్రశేఖర్ రావు కౌంటరిచ్చారు. రాజ్యాంగ బద్ధంగానే విలీనం జరిగిందని అన్నారు. నిబంధనల ప్రకారమే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం జరిగిందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో కొన్ని నిబంధలు ఉన్నాయని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారాలు జరుగుతాయని చంద్రశేఖర్ రావు అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో చేరతామని వచ్చారని.. తాము చేర్చుకోలేదని చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తమకు కావలసిన మెజారిటీ ఉందని చెప్పామన్నారు. ఇటీవల టీడీపీ రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేశారు. గోవాలో కూడా ఇలానే జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతుందని చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.

English summary
Telangana Municipal Law Amendment Bill 2019 passed by Telangana Assembly The bill was introduced in the CM KCR House and approved by the Legislature. CM KCR said that the new municipality law is being introduced with the intention of making the development systematic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X