హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడుగులు వేరైనా లక్ష్యం ఒకటేనా.?టీ కాంగ్రెస్ లో పాదయాత్రల జోరు.!నేతల హుషారు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కొత్త సీఎల్పీ నాయుకుడి చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా పాదయాత్రల మీద దృష్టి కేంద్రీకరించాయి. వివిధ సమస్యల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాలుదువ్వుతున్నారు. వివిధ మార్గాల్లో పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నా., తెలంగాణ కాంగ్రెస్ నాయకుల లక్ష్యం ఒకటే అని తెలుస్తోంది. టీ కాంగ్రెస్ లోని చురుకైన నేతలు ఈ పాదయాత్ర కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

TPCC New Chief : VH On Revanth Reddy వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీలో ఉండి ఆ పార్టీనే ఖతం!!
తెలంగాణ కాంగ్రెస్ యాత్రల సీజన్.. ముగ్గురు నేతల కార్యాచరణ...

తెలంగాణ కాంగ్రెస్ యాత్రల సీజన్.. ముగ్గురు నేతల కార్యాచరణ...

ఇదిలా ఉండగా రైతులతో పాటు తెలంగాణ ప్రజానికానికి చేరువ కావాలనే లక్ష్యంతో కూడా ఈ పాదయాత్రలకు శ్రీకారం చుట్టునట్టు తెలుస్తోంది. తెలంగాణలో నెలకొన్న నిరుద్యోగ సమస్యమీద కూడా తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా యువతను సమీకరించి వారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ పాదయాత్రలకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

రోండో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి యాత్ర.. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న రైతులు..

రాజీవ్ రైతు భరోసా దీక్షలో భాగంగా అచ్చంపేట బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, స్ధానికి రైతు సమస్యలను విని చలించిపోయినట్టు తెలుస్తోంది. అచ్చంపేట దీక్షా కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడి నుండే హైదరాబాద్ వరకూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వింటూనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతుందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆదివారం తొమ్మిది కిలోమీటర్లు పాటు పాద యాత్ర చేసిన రేవంత్ రెడ్డి, రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

13రోజుల పాటు సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర.. భీంసరి నుండి ఖమ్మం వరకూ కొనసాగనున్న యాత్ర..

13రోజుల పాటు సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర.. భీంసరి నుండి ఖమ్మం వరకూ కొనసాగనున్న యాత్ర..

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో కీలక నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంతో సీఎల్పీ సామావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రైతు సమస్యల గురించి మీడియాతో నాటుగు మాటలు చెప్పడం కాకుండా క్షేత్ర స్థాయిలో వారి సమస్యలు తెలుసుకుని ధైర్యాన్ని ఇస్తే శ్రేయస్కరంగా ఉంటుందని సీఎల్పీ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క
సార‌థ్యంలో సీఎల్పీ బృందం రైతుల‌తో ముఖాముఖీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ నెల 9 నుంచి ఆదిలాబాద్ జిల్లా భీంసరి నుంచి ప్రారంభం అయ్యే యాత్ర‌ 13 రోజుల పాటు కొససాగి ఈనెల 21 న ఖమ్మంలో ముగుస్తుంది. ఈ పాదయాత్రలో భట్టి విక్రమార్క రైతుల‌తో నేరుగా మాట్లాడ‌నున్నట్టు తెలుస్తోంది.

కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైుతలకు నష్టమే.. రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి పాదయాత్ర..

కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైుతలకు నష్టమే.. రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి పాదయాత్ర..

ఇదిలా ఉండగా సదాశివపేట నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేసేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10 వ తేదీ బుధవారం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కొనుగోలు చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రకు అనుమతి కోరుతూ సంగారెడ్డి జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ కమిటీ దరఖాస్తు చేసుకుంది. సదాశివపేట మండలం, అరూర్ గ్రామం నుండి సదాశివపేట-సంగారెడ్డి చౌరస్తా -కంది -రుద్రారం ,ఇస్సాపూర్ -ముత్తంగి -పఠాన్ చెరువు -లింగంపల్లి-శేరిలింగంపల్లి-సెంట్రల్ యూనివర్సిటీ -గచ్చిబౌలి -టోలి చౌకి -మెహదీపట్నం -పంజాగుట్ట చౌరస్తా నుండి ప్రగతిభవన్ వద్ద ఈ యాత్ర ముగుస్తుందని తెలుస్తోంది.

English summary
It seems that the padayatra season has started in the Telangana Congress party. Congress leaders Bhatti Vikramarka, Malkajgiri MP Revant Reddy and Sangareddy MLA Jaggareddy seem to have designed the walk events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X