హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా రేటు రెండు వేలు కాదు: డబ్బులు తీసుకోండి కానీ మాకే ఓటేయండన్న ఓవైసీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: కాంగ్రెస్‌ నుంచి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మా పార్టీకే వేయండంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా డబ్బులున్నాయన్న ఓవైసీ... ఆ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు తమ పార్టీకి వేయాలంటూ ఓటర్లకు ఓవైసీ పిలుపునిచ్చారు.

 కాంగ్రెస్ దగ్గర చాలా డబ్బులున్నాయి

కాంగ్రెస్ దగ్గర చాలా డబ్బులున్నాయి

కాంగ్రెస్ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఓవైసీ ఆ డబ్బులు తనవల్లే వస్తున్నాయి కాబట్టి అవి తీసుకుని తన పార్టీకి ఓటు వేయాలని కోరారు. అయితే తన విలువ రూ. 2వేలు కాదని అది ఇంకా ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు ఓవైసీ. కాంగ్రెస్ వారు డబ్బులు ఇచ్చి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ నెలలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 120 మున్సిపాలిటీలకు 10 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారాలతో బిజీగా గడుపుతున్నాయి.

భైంసా అల్లర్ల వెనక హిందూ సంఘాలు: ఓవైసీ

భైంసా అల్లర్ల వెనక హిందూ సంఘాలు: ఓవైసీ

ఇదిలా ఉంటే భైంసాలో ఇప్పటికే కొందరు హిందూ సంఘాలకు చెందిన వారు మతకల్లోలాలకు తెరతీశారని ఆరోపించారు అసదుద్దీన్. మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలే లక్ష్యంగా ఆ హిందూ సంఘాల వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అసదుద్దీన్ అన్నారు. భైంసాలో కొద్దిరోజుల క్రితం మతఘర్షణలు చెలరేగాయి. వీటికి కారణం హిందూ సంఘాలే అని అసదుద్దీన్ ఆరోపణలు చేశారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హిందువులు లక్ష్యంగా దాడులు: రాజాసింగ్

హిందువులు లక్ష్యంగా దాడులు: రాజాసింగ్

ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ నేతలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. భైంసా ఘటనను ఆయన ఖండించారు. రాష్ట్రంలో మతకల్లోలాలు పెచ్చుమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణం పౌరతస్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ర్యాలీలు తీయడమే అని రాజాసింగ్ మండిపడ్డారు. ఈ ర్యాలీల పేరుతో హిందువులపై దాడులకు కొందరు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ ర్యాలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు కొందరు స్పాన్సర్ కూడా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. స్పాన్సర్ చేస్తోంది టీఆర్ఎస్ మరియు మజ్లిస్ నేతలే అని రాజాసింగ్ ఆరోపించారు.

సోమవారం నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో రెండు మతాల వారి మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి చేయిదాటింది.

English summary
Owaisi has said Congress has a lot of money, voters should take money from the party and vote for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X