హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమం నుంచి మంత్రి దాకా.. ఈటల రాజేందర్ ప్రస్థానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సౌమ్యుడిగా ముద్రపడ్డ ఈటల రాజేందర్ వ్యక్తిత్వంలోనూ మంచి మార్కులే కొట్టేశారు. ఉద్యమ సహచరుడిగా సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల.. తొలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. బడ్జెట్ లెక్కల్లో తన మేధస్సును రంగరించారు. ఖజానా మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీ రోల్ పోషించి పార్టీ ఘనవిజయానికి కృషి చేశారు. ఈసారి మంత్రివర్గంలో ఈటలకు చోటు ఉండకపోవచ్చనే ఊహాగానాలకు తెరదించుతూ మరోసారి పట్టం కట్టారు కేసీఆర్.

ది లీడర్.. బీసీ నేత

ది లీడర్.. బీసీ నేత

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ లీడర్ ఈటల రాజకీయ ప్రస్థానం అంతా ఈజీ కాదు. ఎన్నో ముళ్లబాటలు దాటుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. కరీంనగర్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పొలిటికల్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ఆర్థికశాఖ మంత్రిగా చరిత్రపుటల్లో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకున్నారు. ఖజానా మంత్రిగా తనదైన ముద్రవేశారు.

పౌరసరఫరాల శాఖ బాధ్యత కూడా ఆయనే నిర్వర్తించారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో ఆయనకు స్పీకర్ పదవి కట్టబెడతారనే టాక్ నడిచింది. కేసీఆర్ దగ్గర ఉన్న చనువుతో ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. ఆ క్రమంలో అసలు ఆయనకు కేబినెట్ లో బెర్త్ లేదనే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆయనను మంత్రి పదవి మరోసారి వరించింది.

 రాజేంద్రుడి ప్రస్థానం

రాజేంద్రుడి ప్రస్థానం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్.. 1964 మార్చి 20వ తేదీన జన్మించారు. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈటలకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రస్థానం మొదలు గులాబీ జెండా నీడన ముందుకు సాగుతున్నారు ఈటల రాజేందర్. తెలంగాణ రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా సమర్థవంతమైన పాత్ర పోషించారు. తన వాగ్ధాటితో సభను ఆకట్టుకునేవారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో క్రీయాశీలక పాత్ర పోషించారు.

నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెన్నంటే నడుస్తూ.. పెద్దాయనకు నమ్మకస్తుడిగా ముద్రపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల.. తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలకు కూడా ఆయనే మినిస్టర్ గా వ్యవహరించారు.

 గులాబీ జెండా నీడన..!

గులాబీ జెండా నీడన..!

2001లో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. 2002లో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. కమలాపూర్ సెగ్మెంట్ నుంచి 2004, 2008లో ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హుజురాబాద్ నుంచి 2009, 2010లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ నాలుగు టర్ముల్లోను టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్థికశాఖతో పాటు పౌరసరఫరాల శాఖను నిర్వర్తించారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈటలను మళ్లీ మంత్రి పదవి వరించింది.

 డబుల్ హ్యాట్రిక్..!

డబుల్ హ్యాట్రిక్..!

ఈటల రాజేందర్ మాట్లాడితే చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల దాకా శ్రద్ధగా వినొచ్చు. అంత నెమ్మదిగా, ఎలాంటి తడబాటు లేకుండా, స్పష్టంగా మాట్లాడతారు. 2004 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందారు. 2008 ఉపఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజురాబాద్ నుంచి పోటీచేసి విజయకేతనం ఎగురవేశారు.

ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యాన 2010లో జరిగిన ఉపఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 2014లో జరిగిన జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లలో ఈటల విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అలా ఉపఎన్నికలతో కలుపుకుని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈటల. కరీంనగర్ జిల్లా నుంచి బీసీ నేతగా తొలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న ఈటల.. ఈసారి కూడా మంత్రిగా మరోసారి ఛాన్స్ కొట్టేశారు.

English summary
Etala Rajender, who was one of the TRS important political leader from telangana has once again been a minister in the government. For the second term, KCR has been appointed etala as minister from the BC community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X