హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మరోసారి ఫుల్ లాక్‌డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మరోసారి లాక్‌డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్...

మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్...

హైదరాబాద్ నగర పరిధిలో పూర్తి లాక్‍డౌన్ మళ్లీ విధించాలా? లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేగాక, లాక్‌డౌన్ అంశంపై సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.

కేంద్రం ఇచ్చిన సడలింపులేనంటూ..

కేంద్రం ఇచ్చిన సడలింపులేనంటూ..

శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. కేంద్రం ఇచ్చిన సడలింపులను తాము అమలు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

నగరంలో కరోనా భయం లేకుండా జనం..

నగరంలో కరోనా భయం లేకుండా జనం..


కాగా, లాక్‌డౌన్ సడలింపుల అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున సుమారు 100 కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బయటికి రావడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం లాంటి చర్యలతో కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Lockdown : AP Ready To Unlock Restaurants & Hotels In These 4 Districts From June 8
కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

తాజాగా కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా ఆయన అధిక జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. సూపిరింటెండెంట్ తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 4320 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 165 మంది మరణించారు. 2162 యాక్టివ్ కేసులుండగా, 1993 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 3,05,613 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8711 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

English summary
Telangana minister Talasani Srinivas yadav response on Again full lockdown in Hyderabad issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X