హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సవతి ప్రేమ.. నిధుల విడుదలపై నిర్లక్ష్యం.. కేంద్రంపై తలసాని ఫైర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన్‌లో లేదని చెప్పారు. దేశంలో అంతర్భాగమేనని బీజేపీ నేతలు గుర్తించాలని అన్నారు. అందరినీ సమదృష్టితో చూడాలని తలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే తమపై ఏడవడం తప్ప.. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. కరీంనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మేరకు కామెంట్స్ చేశారు.

Recommended Video

గంగపుత్రుల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడలేదు- మంత్రి తలసాని

సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిడితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమొస్తుందని నిలదీశారు. రాష్ట్రం నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి భారీగా నిధులు వెళుతున్నాయని చెప్పారు. కానీ కేంద్రం నుంచి అందులో సగం కూడా రాష్ట్రానికి నిధులు అందడం లేదని మండిపడ్డారు. తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిధుల్లో అన్యాయం జరుగుతోన్న నోరు విప్పని నేతలు.. ఊరికే కామెంట్స్ మాత్రం చేస్తారని ధ్వజమెత్తారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే నిధులు తీసుకురావొచ్చు కదా అని అడిగారు.

talasani srinivas yadav slams central government

టీఆర్ఎస్- బీజేపీ మధ్య అభివృద్ధి- నిధుల అంశంపై చర్చ జరుగుతోంది. ఇవాళ మరోసారి తలసాని బీజేపీ/ కేంద్రంపై ఆరోపణలు చేశారు. నిధులు ఇవ్వడం లేదని.. ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వడం లేదని చెప్పారు. పనిలో పనిగా బీజేపీ నేతలను కౌంటర్ చేశారు. తలసాని కామెంట్స్ చర్చకు దారితీశాయి. మరీ వీటిపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

English summary
talasani srinivas yadav slams central government on welfare schemes and other issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X