• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు వెన్నుపోటుకు.. ఎంపీల పిరాయింపుకు లింకు పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!?

|

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఇటీవల రాజ్య సభ సభ్యుల పార్టీ ఫిరాయింపుల నేపధ్యంలో బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు టీడీపీకి లేదని ఆయన అన్నారు.ప్రస్తుతం దీనిపై టీడీపీ, బీజేపీ అనైతికంగా వ్యవహరించిందని, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చెయ్యటం అన్యాయం అని ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం జగన్ కు సవాల్ .. బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో వైఎస్సార్ తరహా నిర్ణయం తీసుకుంటారా?

టీడీపీ రాజ్య సభాపక్ష విలీనం రాజ్యాంగ బద్దమే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టీడీపీ రాజ్య సభాపక్ష విలీనం రాజ్యాంగ బద్దమే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతనే బీజేపీలో చేరారని ఆయన పేర్కొన్నారు .అయితే బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యబద్దంగానే జరిగిందని పేర్కొన్న కిషన్ రెడ్డి కొందరు కావాలనే ఈ విలీనాన్ని తప్పుపడుతున్నారని అన్నారు. టీడీపీనీ వీడిన నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌కు విలీన లేఖ ఇచ్చారని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని, ఏ సభలోనైనా మూడో వంతు సభ్యులు విలీనం చేయాలని కోరితే అది చట్టవిరుద్ధం కాదని ఆయన పేర్కొన్నారు .

 వై సీపీ నుండి ఫిరాయిమ్పులకు ప్రోత్సహించి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారా అని ఫైర్ అయిన కిషన్ రెడ్డి

వై సీపీ నుండి ఫిరాయిమ్పులకు ప్రోత్సహించి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారా అని ఫైర్ అయిన కిషన్ రెడ్డి

అయితే గతంలో టీడీపీ పార్టీ రాజ్యంగ విరుద్ధంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుందని అలా చేసిన టీడీపీకి ఈ రోజు బీజేపీని ప్రశ్నించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తమ పార్టీలో ఎంతమందిని చేర్చుకున్నారో తెలిసి కూడా ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఈ విధంగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు . టీడీపీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.

ఎన్టీఆర్‌ను కాదని ఏ ప్రతిపాదికన చంద్రబాబు సీఎం అయ్యారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

ఎన్టీఆర్‌ను కాదని ఏ ప్రతిపాదికన చంద్రబాబు సీఎం అయ్యారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

అసలు బీజేపీ ప్రాజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ. అలాంటి బీజేపీపైన ఆరోపణలు చెయ్యటం హేయం అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను కాదని ఏ ప్రతిపాదికన చంద్రబాబు సీఎం అయ్యారో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు సరైనవి కాదని టీడీపీని వీడి బీజేపీలో చేరిన వారిపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనేని వారిపై ఎలాంటి కేసులు, చార్జ్ షీట్ లు లేవని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు పార్టీ మారిన ఎంపీలపై ఎటువంటి అనర్హత వేటు ఉండదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central Minister Kishan Reddy had criticized Chandrababu Naidu and tdp leaders comments on BJP. Union Minister of State for Home Affairs G Kishan Reddy on Sunday came down heavily on accusations of Telegu Desam Party (TDP) after four of its MPs joined BJP. He said that TDP had no moral right to question the BJP in the wake of the recent defection of Rajya Sabha members. He said that the TDP does the horse trading.He also questioned TDP that how N Chandrababu Naidu became Chief Minister avoiding NT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more