హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్‌లో పోటీకి సై: ఒంటరిగానే బరిలోకి.. రేపు అభ్యర్థుల ప్రకటన: ఎల్ రమణ

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ నగారా మోగింది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. భాగ్యనగర ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్- బీజేపీ మధ్య కనిపిస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం కూడా సత్తా చాటే అవకాశం ఉంది. అయితే బల్దియాలో తాము కూడా పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ స్పష్టంచేసింది. రేపు (బుధవారం) అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టంచేశారు. అయితే అన్నీ చోట్ల పోటీ చేయమని.. బలంగా ఉన్న చోట మాత్రమే అభ్యర్థులను బరిలోకి దించుతామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో టీడీపీ బలంగా ఉన్న చోట అభ్యర్థులను బరిలోకి దింపుతామని రమణ స్పష్టంచేశారు. ఆయా స్ధానాలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. తమ పార్టీ బలంగా ఉన్న చోట మాత్రమే క్యాండెట్లను నిలబెడుతామని చెప్పారు. అయితే ఈ సారి ఎలాంటి పొత్తులు ఉండబోవు అని తేల్చిచెప్పారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. హైదరాబాద్‌లో వయోజనులను ఓట్లు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందని రమణ అన్నారు. ఎందుకంటే సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని రమణ స్పష్టంచేశారు.

tdp will contest in ghmc elections: L ramana

Recommended Video

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. అందుకోసమే షెడ్యూల్ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసింది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.

English summary
tdp will contest ghmc elections tdp telangana president L ramana said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X