హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగంలోంచి తీసేశారు: మనస్తాపంతో లేడీ టెక్కీ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించారని మనస్తాపం చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..? భర్తతో గొడవ.. ఎఫైర్‌ ఉందని తెలిసి మనస్థాపం, అల్లుడే..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..? భర్తతో గొడవ.. ఎఫైర్‌ ఉందని తెలిసి మనస్థాపం, అల్లుడే..

రెండున్నరేళ్ల క్రితం నగరానికి..

రెండున్నరేళ్ల క్రితం నగరానికి..

వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌లోని జగదాంబనగర్ కాలనీకి చెందిన హరిణి(24) బీటెక్ పూర్తి చేసుకుని రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది.

గచ్చిబౌలి సైబర్‌హిల్స్‌లోని వసతి గృహంలో ఉంటూ మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.

ఉద్యోగం నుంచి తొలగిస్తూ..

ఉద్యోగం నుంచి తొలగిస్తూ..

అదనపు సిబ్బందిని తొలగించే క్రమంలో ఆ సంస్థ కొంతమంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ వరకు దీనికి గడువు విధించింది. కాగా, నోటీసులు అందుకున్న వారిలో హరిణి కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగం కోల్పోతే తనకు వేరే సంస్థలో ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే ఆ:దోళన చెందిన హరిణి తీవ్ర నిర్ణయానికి వచ్చింది.

తన గదిలోనే..

తన గదిలోనే..

మంగళవారం రాత్రి తాను ఉంటున్న వసతి గృహంలోని తన గదిలోనే ఉరివేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోతోందని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తీసేయడంపై ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
A 24-year-old woman working a software firm committed suicide on Wednesday at the hostel she was residing at in Gachibowli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X