హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు.. ఓటింగ్ అంటే మాత్రం అనాసక్తి.. టెకీల నయా పోకడ..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. వృద్దులు, కాళ్లు లేని వారు.. పండు ముసలివారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరీ యువత/ కుర్రకారు.. ముఖ్యంగా సాప్ట్ వేర్ ఉద్యోగులు మాత్రం ఓటు అంటే దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో సమస్యను ప్రస్తావించే వారు.. ఓటు వేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా హాలీ డే ఇవ్వడంతో ఎంచక్కా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఓటు వేయడానికి మాత్రం ముందుకురాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గ్రేటర్ పోలింగ్‌లో ఘర్షణలు: పరస్పర దాడులు, స్లిప్‌ల పంపిణీ, దొంగ ఓట్లు వేసే యత్నం..గ్రేటర్ పోలింగ్‌లో ఘర్షణలు: పరస్పర దాడులు, స్లిప్‌ల పంపిణీ, దొంగ ఓట్లు వేసే యత్నం..

20 శాతం దాటని పోలింగ్

20 శాతం దాటని పోలింగ్


మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలింగ్ శాతం 20 దాటలేదు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. కనీసం 10, 11 గంటల వరకు కూడా అంతగా ముందకు రాలేదు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. ఓటు వేస్తేనే సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. అయినా టెకీలు బద్దకాన్ని వీడటం లేదు. ఓటు వేయాలని నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పెడచెవినా పెడుతున్నారు.

ఓటులో ఇన్ యాక్టివ్

ఓటులో ఇన్ యాక్టివ్

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే టెకీలు.. ఓటింగ్‌లో ఇన్ యాక్టివ్‌గా ఉంటున్నారు. బద్దకమే.. నిర్లక్ష్యమే తెలీదు కానీ ఓటంటేనే ముఖం చాటేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోడ్డు బాలేదు, డ్రైనేజీ బాలేదు, తాగునీరు రావడం లేదు.. వీధిలైట్లు రావడం లేదు అంటూ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. కానీ ఓటు వేయనికి సమస్యలను ప్రస్తావించే అవకాశం ఎక్కడిదని విశ్లేషకులు చెబుతున్నారు. పండు ముసలి, కాళ్లు లేని పెద్దాయన వీల్ చైర్ మీద వచ్చి మరీ ఓటేశారు. ఓ ముసాలవిడ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఖాళీగా పోలింగ్ స్టేషన్లు

ఖాళీగా పోలింగ్ స్టేషన్లు

కొండాపూర్, మియాపూర్, మాదాపూర్.. ఐటీ హబ్. ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఎన్నికల సిబ్బంది/ పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వారి కోసమే ఉండగా..వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఓటు హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని చెబుతున్నారు. అయినా పెడచెవిన పెడుతున్నారు. హాలీ డే వచ్చింది కదా అని.. రెస్ట్ తీసుకుంటున్నారో ఏమో.. ఓటు వేయడానికి మాత్రం రావడం లేదు.

Recommended Video

GHMC Elections 2020 Polling Update గ్రేటర్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా ఉందంటే...!!

English summary
software employees are not interest in vote ghmc area. majority people not come to polling stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X