చల్లని కబురు: సిటీ సహా జిల్లాల్లో వర్షం..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. వడగాలులు కూడా వీస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి తీపి కబురు చెప్పింది. ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వచ్చే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్లో గురువారం 35.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కోంది. రాబోయే రెండు రోజుల్లో నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.