హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కీలక అంశాలపై 15 రోజులు చర్చ..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారైంది. వచ్చేనెల 7వ తేదీ నుంచి 20 రోజులపాటు సెషన్ జరగనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ శుక్రవారం ఉత్తర్వులను జారీచేశారు. కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మెజార్టీ సమయాన్ని వాటిపై చర్చించేందుకు కేటాయించాలని భావిస్తోంది. దాదాపు 15 రోజులపాటు అంశాలపై చర్చించేందుకు కేటాయించనుంది.

గత బడ్జెట్ సమావేశాలను కరోనా వైరస్ వల్ల అర్ధాంతరంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చర్చకు రానీ బిల్లులు, ఆమోదం పొందని బిల్లులు ఈసారి సభలో ప్రవేశపెడతారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

telangana assembly meeting start from 7th september..

Recommended Video

Floods: ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు,కోనా రెడ్డి చెరువు కు గండి ! పోటెత్తుతున్న వరద నీరు...!!

అయితే అధికార పార్టీకి చెందిన పలువురి ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో చాలా మంది వైరస్ నుంచి కోలుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ కూడా క్యూర్ అయ్యారు. ఇటీవలే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కరోనా బారిన పడ్డారు. కరోనా తగ్గితేనే ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.

English summary
telangana assembly and council meeting start from 7th september. session will be continue 20 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X