హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీశ్‌రావు, గంగుల ఇన్.. ఈటల రాజేందర్, ఎర్రబెల్లి ఔట్...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రభుత్వంలో క్రమంగా తగ్గిస్తున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా చోటు దక్కకపోవడం విశేషం. కొత్త బీఏసీ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావును తప్పించి .. ఇటీవలే క్యాబినెట్‌లో చేరిన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు చోటు కల్పించారు. బీఏసీ ఎంపిక అనేది స్పీకర్ విచక్షణ అధికారం అని చెప్తున్నా .. ధిక్కార స్వరానికి ఫలితమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 కొత్త బీఏసీ నియామకం

కొత్త బీఏసీ నియామకం

శాసనసభ బీఏసీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పునర్ వ్యవస్థీకరించారు. అయితే కొత్త కమిటీలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు పేరును ప్రత్యేక ఆహ్వానితుడిగా చేర్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న కమిటీలో సీఎం కేసీఆర్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, టీ హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గొంగిడి సునీత, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. ఈ మేరకు కొత్త జాబితాను శాసనసభ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరించారు. స్పీకర్ విచక్షణ మేరకు .. బీఏసీని పునర్ వ్యవస్థీకరించుకొవచ్చిన అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి.

ధిక్కార స్వరం ..

ధిక్కార స్వరం ..

ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ .. తనకు మంత్రి పదవీ ఎవరీ భిక్ష కాదని కామెంట్ చేయడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతోనే ఆయనను క్రమంగా తగ్గిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి 21న బీఏసీని ఏర్పాటు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్‌గా సభ్యులుగా సీఎం కేసీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్లు ఉన్నాయి.

 హరీశ్, గంగుల ఇన్ ..

హరీశ్, గంగుల ఇన్ ..

ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. క్యాబినెట్‌లో చేరిన హరీశ్‌రావు, గంగుల కమాలకర్ పేర్లను చేర్చగా ... ఈటల రాజేందర్‌ను తప్పించారు. ఈటలతోపాటు ఎర్రబెల్లికి కూడా చోటు లభిచంలేదు. వీరితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వెంకటవీరయ్య, రాజాసింగ్ కూడా చోటు కోల్పోయారు. టీడీపీ నుంచి నాగేశ్వరరావు, బీజేపీ నుంచి రాజాసింగ్ సభలో ప్రాతినిధ్యం ఉన్న .. బీఏసీలో చోటు లభించకపోవడం చర్చకు దారితీసింది.

English summary
Telangana Minister of Health, Etala Rajender, is gradually reduced to government. Speaker Pocharam Srinivas Reddy has announced his removal from the Business Advisory Committee (BAC). Another minister, Errabbelli Dayakar Rao, is also. In the new BAC Committee, Ministers Rajender and Errebeli Dayakar Rao were excluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X