హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బీజేపికి కొత్త అద్యక్షుడు..? ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్న అదిస్టానం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ బీజేపిలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత శాసన సభ ఎన్నికలు పార్టీని నిరాశ పరిచినా, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం వంద సునామీల బలాన్నిచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఏకంగా నలుగురు ఎంపీలు గెలవడంతో పార్టీలో నూతన ఉత్సాహం తొనికిసలాడుతోంది. దానికి తోడు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతుండడంతో పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో బాగంగా తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న లక్ష్మణ్ ను స్థానంలో కొత్త అద్యక్షుణ్ని ఎంపిక చేయాలని అదిష్టానం భావిస్తున్నట్టు తెలస్తోంది. అందులో భాగంగా తెలంగాణ నుండి ముగ్గిరి పేర్లను బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా పరిశీలనకు వెళ్లినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఊపుమీదున్న బీజేపి..! కొత్త సారథి కోసం అణ్వేషణ..!!

తెలంగాణలో ఊపుమీదున్న బీజేపి..! కొత్త సారథి కోసం అణ్వేషణ..!!

తెలంగాణలో అదికారమే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే సాధించిన బీజేపీ ఇక ఆశలు వదిలేసుకుందట. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా... ఆశ్చర్యకరంగా ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలవడంతో ఆశలు చిగురించాయట. ఈ అనూహ్య ఫలితంతో గేర్ మార్చిన బీజేపీ తెలంగాణలో బలపడే చాన్స్ ఉందని గమనించి ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది. ఇతర పార్టీల నేతల చేరికలకు రెడ్ కార్పెట్ వేసింది. ఇప్పటికే కొందరు చేరారు. ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఆలోచిస్తున్నారు. వీరంతా బీజేపీలోకి వస్తే, కొత్త రక్తం ఎక్కినట్టే. పాత సీసాలో కొత్త సారాను నింపడం బాగుండదని ఆ పార్టీ జాతీయ నేత అమిత్ షా అనుకుంటున్నారు. అందుకే, కొత్త సీసాలో కొత్త సారా పోయాలనుకుంటున్నారు. ఇందుకోసం, ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ముగ్గిరి పేర్లను పరిశీలిస్తున్న బీజేపి..! అమీత్ షా మాస్టర్ ప్లాన్..!!

ముగ్గిరి పేర్లను పరిశీలిస్తున్న బీజేపి..! అమీత్ షా మాస్టర్ ప్లాన్..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాగానే పనిచేస్తున్న బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఇప్పుడు మార్చడానికి అమిత్ షా సిద్ధమయ్యారు. మొన్న తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా, 20 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టారు. కానీ, అందులో సగం మాత్రమే పూర్తయింది. దీంతో, ఆయన ఇక్కడి నేతలకు గట్టిగా క్లాస్ పీకారట. ఇలాగైతే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ముందుకు నడిపించలేమని నిశ్చతాభిప్రాయానికి వచ్చారట. అందుకే, అర్జంటుగా తెలంగాణ పార్టీని సంస్కరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, తెలంగాణ అధ్యక్షుడిని మార్చబోతున్నారు. కొత్త బీజేపీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్... పేర్లు వినిపిస్తున్నాయి.

సామాజిక వర్గాలపై కసరత్తు..! ఆమోదయోగ్యమైన అభ్యర్ధికే తెలంగాణ పగ్గాలు..!!

సామాజిక వర్గాలపై కసరత్తు..! ఆమోదయోగ్యమైన అభ్యర్ధికే తెలంగాణ పగ్గాలు..!!

మురళీధర్ రావు, రాంచంద్ర రావుది అగ్ర వర్ణం (బ్రాహ్మణ). అందుకే, బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ వైపు అమిత్ షా మొగ్గు చూపుతున్నారు. అరవింద్ ఏకంగా నిజామాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురును ఓడించడం బీజేపీ పెద్దలను ఆకర్షించింది. అరవింద్ దూకుడు - వ్యవహారశైలి బాగా నచ్చడంతో ఆయనకే పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం మైనస్ అంటున్నారు. లక్ష్మణ్ బీసీ కావడంతో ఆయన స్థానంలో మరో బీసీని నియమిస్తేనే పార్టీలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుందని భావిస్తున్నారట..

కొత్త రక్తం కోసం బీజేపి కసరత్తు..! పార్టీని అదికారంలోకి తేవడమే లక్ష్యమంటున్న నేతలు..!!

కొత్త రక్తం కోసం బీజేపి కసరత్తు..! పార్టీని అదికారంలోకి తేవడమే లక్ష్యమంటున్న నేతలు..!!

అందుకే జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న మురళీ ధర్ రావును ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని చేయడం మంచిది కాదన్న అభిప్రాయానికి అమిత్ షా వచ్చారట. ఇక అగ్రవర్ణం కోటా రాంచంద్రరావుకు కూడా మైనస్ గా మారింది. అందుకే ఇప్పుడు యువకుడు - దూకుడుగా వెళ్తున్న అరవింద్ ను బీజేపీ కొత్త అధ్యక్షుడిగా చేయాలని అమిత్ షా యోచిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే మురళీధర్ రావు - రాంచంద్రరావు - అరవింద్ లలో అమిత్ షా ఎవరిపై మొగ్గు చూపుతారన్న ఆసక్తి బీజేపీ నేతలను ఉత్కంఠకు గురిచేస్తోందనే చర్చ జరుగుతోంది.

English summary
While the Legislative Assembly has disappointed the bjp, the parliamentary elections are still debating the strength of a hundred tsunamis. With the victory of four MPs, there is renewed excitement in the party. Apart from that, the party is planning to be more aggressive as the membership registration program continues to be successful in Telangana. It is expected that the new head of the party will be replaced by Laxman, who is the head of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X