హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2019-20కి రూ.1,45,492 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఈరోజు తొలిసారిగా పూర్తిస్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ఆర్థికశాఖ మంత్రిగా హరీష్ రావు కేసీఆర్ కేబినెట్‌లో చేరడంతో ఆయన తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ను శాసనమండలిలో హరీష్ రావు ప్రవేశపెట్టనుండగా... శాసనసభలో మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అది ఆరునెలలకే పరిమితం కావడంతో ఈ సారి బడ్జెట్ పూర్తిస్తాయిలో ప్రవేశపెట్టారు.

ఆర్థికశాఖ మంత్రి వచ్చాక కూడా సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై ఒక్కింత ఆసక్తి నెలకొనడమే కాదు.. రాజకీయవర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో ఆర్థికమాంద్యం నెలకొనడంతో వాస్తవాలకు దగ్గరగా ఈసారి బడ్జెట్ ఉండబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గినట్లు సమాచారం. వ్యవసాయ రంగం, సంక్షేమం,నీటిపారుదలకు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరపనున్నట్లు సమాచారం.

Telangana budget to be tabled today, CM KCR to present budget in Assembly

Newest First Oldest First
12:54 PM, 9 Sep

ఆరోగ్యశ్రీకి రూ.1336 కోట్లు..త్వరలోనే వృద్ధాప్య పెన్షన్ వయసు 57ఏళ్లకు కుదింపు
12:53 PM, 9 Sep

గ్రామ పంచాయతీలకు రూ. 2714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు
12:53 PM, 9 Sep

ఆసరా పెన్షన్ల కోసం రూ.9,402 కోట్లు కేటాయింపు
12:52 PM, 9 Sep

విద్యుత్ సబ్సీడీల కోసం రూ. 8వేల కోట్లు కేటాయింపు
12:51 PM, 9 Sep

మిగులు బడ్జెట్ రూ.2044.08 కోట్లు ఉండగా ఆర్థికలోటు రూ. 24,081.74 కోట్లుగా అంచనా: సీఎం కేసీఆర్
12:50 PM, 9 Sep

పంట రుణాల మాఫీకి రూ.6వేల కోట్లు కేటాయింపు: సీఎం కేసీఆర్
11:56 AM, 9 Sep

కేంద్రప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయలేకపోయేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి: సీఎం కేసీఆర్
11:55 AM, 9 Sep

గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం
11:54 AM, 9 Sep

ఐదేళ్లలో రాష్ట్రసంపద రెట్టింపు అయ్యింది
11:53 AM, 9 Sep

ప్రతీ నెల గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు: సీఎం కేసీఆర్
11:49 AM, 9 Sep

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
11:46 AM, 9 Sep

కేంద్రం తీసుకొచ్చిన విధానాలనే రాష్ట్రాలు అవలంబించాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్
11:46 AM, 9 Sep

దిగజారిన ఆర్థిక పరిస్థితికి కారణం కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానాలే: సీఎం కేసీఆర్
11:45 AM, 9 Sep

విమాన ప్రయాణికుల సంఖ్య 11శాతం పడిపోయింది: సీఎం కేసీఆర్
11:44 AM, 9 Sep

పేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందిస్తున్నాం: సీఎం కేసీఆర్
11:44 AM, 9 Sep

వాహనాల అమ్మకాలు పడిపోవడంతో కొనుగోలు చేసేవారులేక పన్నులు పడిపోయాయి: సీఎం కేసీఆర్
11:43 AM, 9 Sep

వాహన అమ్మకాలు పడిపోవడంతో ఉద్యోగాలు తగ్గిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర విడిభాగాల ధరలు పడిపోయాయి: సీఎం కేసీఆర్
11:42 AM, 9 Sep

దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి తగ్గింది: సీఎం కేసీఆర్
11:42 AM, 9 Sep

ఐటీ రంగంలో 1.10 లక్షల కోట్లు మేరా ఎగుమతులు పెరిగాయి: సీఎం కేసీఆర్
11:41 AM, 9 Sep

పరిశ్రమల్లో 5.8శాతం వృద్ధిరేటు నమోదైంది: సీఎం కేసీఆర్
11:40 AM, 9 Sep

వ్యవసాయరంగంలో 8.1శాతం వృద్ధి నమోదైంది: సీఎం కేసీఆర్
11:40 AM, 9 Sep

తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాం:కేసీఆర్
11:39 AM, 9 Sep

రైతు బంధు, రైతు బీమాలతో రైతులకు ఊరటనిచ్చాం: సీఎం కేసీఆర్
11:38 AM, 9 Sep

అన్ని రంగాల్లో వృద్ధి రేటు నమోదైంది: సీఎం కేసీఆర్
11:37 AM, 9 Sep

ఆర్థిక క్రమశిక్షణతో అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం: సీఎం కేసీఆర్
11:36 AM, 9 Sep

ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరిగింది: సీఎం కేసీఆర్
11:35 AM, 9 Sep

ఐదేళ్లలో అగ్రగామిగా తెలంగాణ నిలిచింది: సీఎం కేసీఆర్
11:35 AM, 9 Sep

మూల ధనం వ్యయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకంటే అగ్రస్థానంలో ఉంది: సీఎం కేసీఆర్
11:30 AM, 9 Sep

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
11:09 AM, 9 Sep

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
READ MORE

English summary
Chief Minister K. Chandrasekhar Rao will introduce the Budget for the 2019-20 financial year in the Assembly on Monday while Mr T. Harish Rao, sworn-in on Sunday and given the finance portfolio, will present it in the Legislative Council.The Cabinet which had met at Pragathi Bhavan here on Sunday evening under the leadership of Mr Chandrasekhar Rao, approved the Budget estimates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X