హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడితో భేటి కానున్న సీఎం కేసీఆర్, సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి భేటీపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానిమోడితో సమావేశం కానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇరువురి సమావేశంలో రాష్ట్రా విభజన సమస్యలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కొరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం కేసిఆర్ గురువారమే ఢిల్లీ వెళ్లనున్నారు.

 రెండవసారి అధికారంలో మొదటి భేటీ

రెండవసారి అధికారంలో మొదటి భేటీ

కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో సీఎం కేసిఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసిఆర్ సమావేశం కావడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం హుజుర్‌నగర్ ఉప ఎన్నికలు జరగడం కూడ ఉత్కంఠకు మరింత అజ్యం పోసింది. ప్రధానంగా మోడీతో భేటీలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరడంతో పాటు కొన్ని విభజన సమస్యలు కూడ చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా అంతకు ముందు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అమోదం కోసం ఆమోద ముద్ర వేయించుకున్న సీఎం కేసిఆర్ ఆతర్వాత మోడీతో సమావేశం కాలేదు.

ఫెడరల్ ఫ్రంట్‌కు తెరలేపిన కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్‌కు తెరలేపిన కేసీఆర్

కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలో కాంగ్రెస్ , బీజేపీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంచన వేసిన సీఎం కేసిఆర్ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల నేతలతో స్యయంగా సమావేశం అయి చర్చించారు. అయితే సీఎం అంచనాలకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు. మరోవైపు తెలంగాణలో కూడ ఉహించని విధంగా బీజేపీ నాలుగు సాధించింది.

 మోడీ ప్రమాణ స్వీకారానికి హజరుకాలేని సీఎం

మోడీ ప్రమాణ స్వీకారానికి హజరుకాలేని సీఎం

ఇక పీఎం నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంకు ఆహ్వానం అందడంతో.. ఢిల్లీ వెళ్లేందుకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు వెళ్లాలని నిర్ణయించారు.. అయితే రోజు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సం ఉండడంతో ... ప్రత్యేక హెలికాప్టర్‌‌లో వెళ్లాలని నిర్ణయించారు. అయితే ప్రత్యేక విమానానికి ఢిల్లీలో అనుమతి లేకపోవడంతో ఆ కార్యక్రమానికి హజరుకాలేకపోయారు. ఇక అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ కార్యాక్రమానికి సీఎం కేసిఆర్ కాకుండా మంత్రి కేటీఆర్ హజరయ్యారు. దీంతో కేంద్రంలో రెండవ సారి మోడీ ప్రధాని అయిన తర్వాత ఇరువురి మధ్య భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Telangana c.m kcr will meet pm narendra modi on friday. kcr may discuss about kaleshwaram project and pending issues of state bifurcation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X