హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ భవిష్యత్ తేల్చేందుకే.. నేటి నుండి రెండు రోజుల క్యాబినెట్ భేటీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ప్రారంభం కానుంది .మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలిపోనుంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్న క్రమంలో ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.

ఈ నెల 28న తెలంగాణా క్యాబినెట్ భేటీ ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశంఈ నెల 28న తెలంగాణా క్యాబినెట్ భేటీ ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ తేల్చనున్న రెండు రోజుల తెలంగాణా క్యాబినెట్ భేటీ ..

ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ తేల్చనున్న రెండు రోజుల తెలంగాణా క్యాబినెట్ భేటీ ..


ఇక నేడు క్యాబినెట్ భేటీతో తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్తు ఏమిటన్నదానిపై రేపటికల్లా స్పష్టత రానుంది. నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించి మరీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఈ క్యాబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రి మండలి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీలో కొత్త నియామకాల నిలిపివేత, రూట్లలో ప్రైవేటుకు పర్మిట్లు ఇవ్వడం వంటి వాటిపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ... సర్వం సిద్ధం చేసిన అధికారులు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ... సర్వం సిద్ధం చేసిన అధికారులు

ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై కోర్టులో కూడా ప్రైవేట్ పరం చెయ్యటం చట్ట విరుద్ధం కాదాని చెప్పి హైకోర్టు సైతం ప్రైవేటుకురూట్ క్లియర్ చేసింది. దీంతో ప్రైవేట్ కు ఇచ్చే రూట్లన్నీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా గ్రామీణ రూట్లలో నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీని కోసం అధికార యంత్రాంగం ప్రైవేటుకు ఇవ్వనున్న రూట్ల ఎంపిక కూడా పూర్తి చేసినట్టు సమాచారం .

 ఆర్టీసీ కార్మిక సమస్య పరిష్కారానికి చర్చించనున్న క్యాబినెట్

ఆర్టీసీ కార్మిక సమస్య పరిష్కారానికి చర్చించనున్న క్యాబినెట్

వీటితోపాటు స్వచ్ఛందంగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులపై ఎటువంటి వైఖరి అవలంబించాలి? వారిపై ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇక ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక సిబ్బందిని ఏం చేయాలి? ప్రైవేటు రూటు పర్మిట్లతోపాటు మిగిలిన రూట్ల నిర్వహణ ఎలా చెయ్యాలి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.ఇక ఇన్ని సార్లు సమీక్షలు , సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఇప్పటివరకు కనిపించలేదు.

ఆర్టీసీ కార్మిక ఆందోళనకు ఫుల్ స్టాప్ పెడతారా ? లేదా అన్నదే అసలు టెన్షన్

ఆర్టీసీ కార్మిక ఆందోళనకు ఫుల్ స్టాప్ పెడతారా ? లేదా అన్నదే అసలు టెన్షన్

రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు కొనసాగే కేబినెట్ సమావేశాల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టే నిర్ణయం తీసుకుంటారు. అయితే తెలంగాణా ఆర్టీసీని కాలగర్భంలో కలిసిపోయేలాగా, ఆర్టీసీ మూసివేత దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారేమో అన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించాలని ఆర్టీసీ కార్మిక లోకం కోరుతుంది.

English summary
Telangana state cabinet meeting to be held on today. The meeting, which begins at two in the afternoon, is expected to continue tomorrow also. The main agenda of the RTC is to organize the Telangana State Cabinet Meeting, especially in the wake of the RTC workers wanting to go on strike and get back to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X