హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం: విద్యారంగంపై కీలక నిర్ణయం, కరోనాపై కూడా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్, విద్యారంగం, సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5వ తేదీన బుధవారం తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతోందని సీఎంవో ట్వీట్ చేసింది. ప్రగతి భవన్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, సీఎఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అసలే వర్షకాలం... ఆ పై కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కానీ లాక్ డౌన్ మళ్లీ విధించే పరిస్థితి లేనందున ఏం చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై డిస్కష్ చేయనుంది. కరోనా వైరస్ వల్ల గత అకడమిక్ ఇయర్ పరీక్షలు లేకుండానే కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు పాస్ చేయించిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో.. ఇంటర్నల్స్ ఆధారంగా పాస్ చేయిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ కాక దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాన్నే అవలంభించారు.

Telangana cabinet meeting on the 5th aug..

కొత్త సచివాలయ నిర్మాణంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. పాత సచివాలయాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయ ఆకృతిపై పలు మార్పులను కూడా కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో క్యాబినెట్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం... తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో డిస్కస్ చేస్తారు.

Recommended Video

Pydikondala Manikyala Rao: కరోనాతో మృతి చెందిన Former Minister & BJP Leader Manikyala Rao

English summary
Telangana cabinet meeting on the 5th august. education system, coronavirus, agriculture issues are to be discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X