హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ కనికరిస్తారా...? క్యాబినెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయి... ఉత్కంఠ రేపుతున్న క్యాబినెట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ భవిష్యత్‌ను తేల్చనున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను వదిలి విధుల్లో చేరుతామని ప్రకటించిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం గురువారం కొనసాగనుంది. ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు కార్మికుల చేరికపై పలు చర్చించిన సీఎం కేసీఆర్, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపు జరగబోయో మంత్రివర్గ సమావేశంలో ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అటు కార్మిక వర్గాలతో పాటు, ఇటు ప్రజల్లో కూడ నెలకొంది.

ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ: వాదనలు ఇలా..ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ: వాదనలు ఇలా..

రాష్ట్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

రాష్ట్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

ఆర్టీసీ సమ్మె భవితవ్యం గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో తేలనుంది. ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్, విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ముందుకు వచ్చినా... ఎలాంటీ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో శాశ్వత పరిష్కారం పేరుతో సీఎం ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
దీంతో క్యాబినెట్ సమావేశంలో ప్రైవేట్ రూట్లపై ప్రకటన , లేబర్ కోర్టుకు వెళ్లే అంశాలతో పాటు కార్మికులను తీసుకునేందుకు రూపోందించిన నిర్ణయాలకూడ అమోదం లభించనున్నారు.

ప్రైవేట్ రూట్లపై నిర్ణయం

ప్రైవేట్ రూట్లపై నిర్ణయం

ఆర్టీసీ నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్దంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో యాబై శాతం మేర ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి కసరత్తు చేసిన ప్రభుత్వం మొత్తం 5100 రూట్లను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో పిల్ వేయడంతో కొద్ది రోజుల పాటు బ్రేకులు పడ్డా.... చివరికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ప్రైవేట్ రూట్లకు పర్మిషన్‌పై కూడ కేబినెట్ నిర్ణయం ప్రకటించనున్నారు.

నిబంధలపై చర్చ...

నిబంధలపై చర్చ...

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటీ నిబంధనలు విధించిన విధుల్లో చేరమని స్పష్టం చేశారు. కేసు లేబర్ కోర్టులో ఉన్న కారణంగా ఎలాంటీ నిబంధనలు లేకుండా చేరతామని చెప్పారు. అయితే కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో తమకు ఉద్యోగాలు ఇస్తే చాలు అన్నట్టు కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే సీఎం మాత్రం భవిష్యత్ కార్మికులు సమ్మెలకు వెళ్లకుండా చూడాలనే యోచనలో ఉన్నారు. అది సాధ్యం కావాలంటే ముందుగానే ఆర్టీసీ ఒప్పందాలపై సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతో క్యాబినెట్‌లో దీనిపై ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

లేబర్ కోర్టుకు వెళతారా ...?

లేబర్ కోర్టుకు వెళతారా ...?

ముఖ్యంగా సమ్మె నేపథ్యంలోనే కేసును విచారించిన రాష్ట్ర హైకోర్టు, కేసును లేబర్ కోర్టులో గాని, లేబర్ కమీషనర్ వద్దగాని పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడ సూచించింది. దీంతో ప్రభుత్వం లేబర్ కోర్టుకు వెళతారా లేక కమీషనర్ వద్దకు వెళతారా అనేది క్యాబినెట్‌లో నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ లేబర్ కోర్టుకు గాని, కమీషనర్ వద్దకు వెళ్లినా, కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

 సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం

సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం

మొత్తం మీద ఆర్టీసీ సమ్మెపై పంతం నెగ్గించుకున్న సీఎం కేసీఆర్ కార్మికుల విజ్ఝప్తిపై సానుకూలంగా స్పందించే అవకాశాలే కనిపిస్తున్నాయి. బస్సుల రవాణా లేక ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కార్మికులు సైతం రోడ్డున పడి, రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం దిగిరాకపోతే ప్రజల నుండి కూడ వ్యతిరేకత వ్యక్తం అయ్యో అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే... కార్మికులకు వరంగా మారే పరిస్థితి నెలకోంటుంది. దీంతో సీఎం కొన్ని నిబంధనలతో తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకుంటారనే సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనే ఉహాగానాలు వెలువడుతున్నాయి.

English summary
RTC future will be decided in Telangana cabinet meeting. cm kcr may take some key decisions on RTC issues for long pending issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X