హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త మంత్రివర్గం రెడీ.. 5 ఇన్, 4 ఔట్, ముగ్గురు సేఫ్, ఒక్కరు డౌట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆశావహులకు నిరీక్షణ ఫలించేనా? పాత మంత్రుల్లో ఈసారి ఇన్ ఎవరు? ఔట్ ఎవరు? కొత్త, పాత మంత్రుల కలయికగా కేబినెట్ ఉండబోతోందా? తొలి మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్ 10 మంది వరకే అవకాశం ఇవ్వబోతున్నారనే వార్తలతో.. అసలు బెర్త్ ఎవరకి దక్కనుందనేది చర్చానీయాంశంగా మారింది.

 బెర్తులెవరికో..!

బెర్తులెవరికో..!

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు దాటింది. రేపు, మాపు అంటూ మంత్రివర్గ విస్తరణపై దాటవేత ధోరణి కనిపించింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఎప్పుడు అనుగ్రహిస్తారోననే ఎదురుచూపు తప్పలేదు. పాత మంత్రుల్లో ఆ టెన్షన్ కనిపించనప్పటికీ.. కొత్తగా ఎన్నికై మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు మాత్రం కేసీఆర్ కరుణ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పెద్దాయన అనుగ్రహంతో మంత్రివర్గ విస్తరణకు ఆమోద ముద్ర పడింది. అయితే బెర్తులు ఎవరికనేది సస్పెన్స్ గా మారడంతో కేబినెట్ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది.

ఎంతమందికి చోటు?

ఎంతమందికి చోటు?

ఈనెల 19, మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ పచ్చజెండా ఊపడంతో.. ఇన్ ఎవరు, ఔట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డబుల్ డిజిట్ కింద 10 మందిని కేబినేట్ లోకి తీసుకుంటారనే వార్తల నేపథ్యంలో.. సింగిల్ డిజిట్‌కే సీఎం కేసీఆర్ పరిమితం కానున్నారనే టాక్ నడుస్తోంది. ఆ నేపథ్యంలో ఎనిమిది మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. వివిధ సమీకరణాలతో కేబినెట్ విస్తరణలో బెర్తులు కన్ఫామ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకునే క్రమంలో ఇతరుల జోక్యం లేకుండా.. కేసీఆర్ ఒక్కరే నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 ఇన్, ఔట్.. సేఫ్, డౌట్

ఇన్, ఔట్.. సేఫ్, డౌట్

ఈసారి కేబినెట్ పాత, కొత్త మంత్రుల కలయికగా ఉండనుంది. పోయినసారి మంత్రులుగా పనిచేసిన కొందరికి బెర్తులు దక్కనుండగా, కొందరికి నిరాశ మిగలనుంది. మరికొందరేమో సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆ వివరాలు ఇలా..

ఔట్ :
హరీష్ రావు, కడియం శ్రీహరి, జోగు రామన్న, పద్మారావు

ఇన్ :
వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గుత్తా సుఖేందర్ రెడ్డి

సేఫ్ :
ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

డౌట్ :
ఈటెల రాజేందర్

 ఇదేనా ఫైనల్ లెక్క..!

ఇదేనా ఫైనల్ లెక్క..!

సికింద్రాబాద్ నుంచి ఇదివరకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన పద్మారావు గౌడ్ కు.. ఈసారి డిప్యూటీ స్పీకర్ ఖరారు చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. సనత్ నగర్ నుంచి గెలిచిన తలసానికి మంత్రిగా బెర్త్ దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు టాక్. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరికీ ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శ్రీనివాస్ గౌడ్‌, నిరంజన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి పోయినసారి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన బీసీ నాయకుడు ఈటల రాజేందర్‌కు ఈసారి బెర్త్ డౌట్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు ఆయన సన్నిహితుడిగా ముద్రపడ్డ కూడా.. వివిధ కారణాలతో తొలి దఫా కేబినెట్ విస్తరణలో ఛాన్స్ లేకపోవచ్చనేది ఒక మాట. అదే సమయంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశమివ్వనున్నట్లు సమాచారం. వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనుంది.

కేసీఆర్ మార్క్

కేసీఆర్ మార్క్

ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇదివరకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి జోగు రామన్నను పక్కనబెట్టి, ఇంద్రకరణ్ రెడ్డిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు తొలి దఫాలో ఛాన్స్ ఇవ్వకుండా రెండో జాబితాలో చూద్దాంలే అనే ధోరణితో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా నుంచి ఈసారి మళ్లీ జగదీశ్ రెడ్డికే పట్టం కట్టనున్నట్లు వినికిడి. మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మరొకరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేబినెట్ లో 18 మందికి అవకాశముండటంతో సీఎం కేసీఆర్ సహా హోం మినిస్టర్ మహమూద్ అలీ ఇదివరకే కొలువుదీరారు. దీంతో మరో 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ఈనెల 19న జరగనున్న కేబినెట్ విస్తరణలో 8 మందిని తీసుకుని మలి విడతలో మరో 8 మందిని తీసుకోవాలన్నది కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది. మంగళవారం నాడు 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు వస్తున్నప్పటికీ.. కొన్ని లెక్కలతో ఎనిమిది మందికే మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు సమాచారం.

English summary
The results of the Assembly polls lasted for two months. There was a tendency towards skipping over cabinet expansion. There is no reason to wait for the Chief KCR to provide for the expansion of the Cabinet. Even though the tension was not seen in old ministers, the newly elected mla's is looking forward to the KCR decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X