హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి.. రాష్ట్రపతి హైదరాబాద్ విడిదిపై సీఎస్ జోషి రివ్యూ

|
Google Oneindia TeluguNews

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. ఈనెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్న ఆయన.. మధ్యమధ్యలో తిరువనంతపురం వెళ్లొస్తారు. రాష్ట్రపతి విడిది కోసం జరుగుతున్న ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి సోమవారం బీఆర్కేభవన్ లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ తో రెడీగా ఉండాలని, అన్ని శాఖలు సంయమనంతో పనులు చేయాలని సీఎస్ జోషి సూచించారు. ఈ నెల 20న మధ్యాహ్నం ఒంటిగంటకు హకీమ్ పేట విమానాశ్రయంలో రాష్ట్రపతి విమానం ల్యాండయ్యే దగ్గర్నుంచి పర్యటన ఆసాంతం గట్టి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మత్తులు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీటీవీ కెమెరాలు, మెడికల్ టీమ్లు, ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖలు ఎప్పటికప్పుడు వివరాలు చెబుతూ, ఆదేశాలు స్వీకరించాలన్నారు.

Telangana Chief Secretary SK Joshi reviews on arrangements made for President Ramnath

27న ఎట్ హోంకు కేసీఆర్, జగన్?

శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్ చేరుకోనున్న రాష్ట్రపతి కోవింద్.. 23న తిరువనంతపురం పర్యటనకు బయలుదేరి వెళతారు. తిరిగి ఈ నెల 26న సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. 27 న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ గవర్నర్లతోపాటు సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్, రెండు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేఅవకాశముంది. ఈ నెల 28 న మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరడంతో శీతాకాల విడిది ముగుస్తుంది.

శీతాకాల విడిది నిమిత్తం 28 వరకు శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రానికి రానున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ మిశ్రా, జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్త, పోలీసు కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్లు మాణిక్ రాజ్, యం.వి.రెడ్డి, హరీష్ ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, పోలీస్ అధికారి యం.కె.సింగ్, కంటోన్మెంట్, జిహెచ్ఎంసి , సమాచార శాఖ, టిఎస్ ఎస్ పిడిసిఎల్ , ఎయిర్ పోర్టు , మిలిటరి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Secretary SK Joshi reviews on arrangements made for President Ramnath kovind's winter sojourn at Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X