హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఎంత భూమి,ఎంతమంది పట్టాదారులు... కొత్త చట్టంతో ఏం జరుగుతుంది... ఇదీ పక్కా లెక్క...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని,ఎకానమీ పడిపోతుందని అప్పట్లో లేనిపోని ప్రచారాలు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో భూముల ధరలు అద్భుతంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎకరం భూమి రూ.10లక్షలకు తక్కువ దొరికే పరిస్థితి లేదన్నారు. రహదారి పక్కన భూమికి ఎకరాకి రూ.25లక్షలు పలుకుతోందన్నారు. హైదరాబాద్ శివారు రాజీవ్ రహదారి చుట్టూ ఎకరా రూ.1కోటి పైమాటే ఉందన్నారు. ఇందులో ల్యాండ్ మాఫియా చొరబడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

ఇదీ భూముల లెక్క...

ఇదీ భూముల లెక్క...

కొత్త రెవెన్యూ చట్టం భూస్వాములకు మేలు చేసేలా ఉందని కొంతమంది తెలియక అవాకులు చవాకులు పేలుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో భూస్వాములే లేరని చెప్పారు. రాష్ట్రంలో ఇంచుమించుగా 1కోటి 60లక్షల ఎకరాల వ్యవసాయ భూమి,66లక్షల పైచిలుకు ఎకరాలు అటవీ భూమి ఉందన్నారు. మిగిలింది నదులు,హైవేలు,పరిశ్రమలు,జనావాసాల ఉపయోగంలో ఉందన్నారు. రాష్ట్రంలో 60లక్షల పైచిలుకు పట్టాదారులు ఉన్నారని చెప్పారు. ఇందులో 2.5ఎకరాల లోపు ఉన్నవారు 39,52,200 మంది,2.5 నుంచి 3 ఎకరాల లోపు ఉన్నవారు 4,70,759 మంది,3 నుంచి 5ఎకరాల లోపు 11,08,09 మంది,7ఎకరాల లోపు 3లక్షల పైచిలుకు మంది, 10ఎకరాల లోపు లక్ష మంది ఉన్నట్లు చెప్పారు. అంతా కలిపితే 98.38శాతం అని చెప్పారు.

మెరూన్ పాస్ బుక్...

మెరూన్ పాస్ బుక్...

ఇప్పటివరకూ కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారని... మిగతావాటికి కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే ఉండేవని అన్నారు. వ్యవసాయేతర భూములు ఉన్నవారికి ఎలాంటి హక్కు పత్రం లేదన్నారు. కానీ కొత్త చట్టంతో వారికి కూడా మెరూన్ కలర్ పాస్‌ బుక్ ఇస్తామన్నారు. ఒక్క ఏజెన్సీ ప్రాంతాల భూముల్లో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. దేశవ్యాప్తంగా అది అలాగే కొనసాగుతోందని అన్నారు. అయితే ఆ భూములపై హక్కులు వర్తించినప్పటికీ ప్రభుత్వం రైతు బంధు,రైతు భీమా వంటి పథకాలు అందిస్తోందన్నారు.

భూ వివాదాల పీడ విరగయ్యేలా...

భూ వివాదాల పీడ విరగయ్యేలా...

కొత్త రెవెన్యూ చట్టం ఆలోచన మూడేళ్ల క్రితమే వచ్చిందన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారడం,రెవెన్యూ అధికారులపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చోటు చేసుకోవడం,పురుగు మందులు,పెట్రోల్ డబ్బాలతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాలకు రావడం... ఇవన్నీ చూసి రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చామన్నారు. నిజానికి భూమి శిస్తు వసూలు చేసేంతవరకే వీఆర్వోల అవసరం ఉంటుందని... ఇప్పుడసలు ప్రభుత్వమే శిస్తు వసూలు చేయట్లేదని... అలాంటప్పుడు వారి అవసరం లేదని చెప్పారు. అందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామన్నారు. భూ వివాదాల పీడ విరగడయ్యేలా కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎవరూ మార్చలేరు...

ఎవరూ మార్చలేరు...


ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం తహశీల్దార్లకు కూడా లేదని కేసీఆర్ అన్నారు. బయోమెట్రిక్,ఐరిస్,ఆధార్ ఫోటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే ధరణి పోర్టల్‌లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్,మ్యుటేషన్,అప్‌డేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త చట్టం పనిచేస్తుందన్నారు. రెవెన్యూ కోర్టుల స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యూనల్స్ తీసుకొస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు.కనీసం తమతో సంప్రదించకుండా హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు.

English summary
Telangana CM KCR said from now onwards land registration process will hardly take 10 minutes with new revenue act 2020.He said even tahsildars also cannot change the details in Dharani portal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X