హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్టీసీ ఉద్యోగ భద్రతపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగారావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Recommended Video

APSRTC-TSRTC : ఏపీ,తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం..సర్వీసులు ఇలా!
కోత విధించిన 50శాతం జీతం తిరిగి చెల్లింపు..

కోత విధించిన 50శాతం జీతం తిరిగి చెల్లింపు..

ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఈ తీపి కబురునందించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో 2 నెలలపాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని, దీనికి అవసరమైన 130 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

50 శాతం ఆర్టీసీ లోకల్ బస్సుల పునరుద్ధరణ

50 శాతం ఆర్టీసీ లోకల్ బస్సుల పునరుద్ధరణ


హైదరాబాద్ నగరంలో 50 శాతం బస్సులను పునరుద్దరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు కేసీఆర్ సూచించారు. ప్రజలు ఆర్టీసీని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాలో లోతుగా చర్చించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సిటీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైదరాబాద్‌కు జిల్లా నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు రవాణా భరోసా దొరుకుతుందని, అందుకోసం హైదరాబాద్‌లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం తెలిపారు.

సీఎం నిర్ణయం పట్ల హర్షం

సీఎం నిర్ణయం పట్ల హర్షం


హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్‌కు జిల్లాలనుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైద‌రాబాద్‌లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిపపడుతూ లాభాల బాటపట్టిన ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ సంస్థలు కాపాడుకుంటూ వస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని తిరిగి చెల్లింపు నిర్ణయంపై మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

English summary
Telangana cm kcr ordered payment of pending employees salary immediately in rtc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X