హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు మమత బెనర్జీ సాయం: థ్యాంక్సంటూ కేసీఆర్, కదిలిన సినీ లోకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంరిలీఫ్ ఫండ్‌కు ఉదారంగా విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు.

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మమత రూ. 2 కోట్లు

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మమత రూ. 2 కోట్లు

తాజాగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ వంతుగా సాయం ప్రకటించారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగించేందుకు రూ. 2 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం బాధాకరమని, వరద ప్రభావంతో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ రాష్ట్రం కూడా ఆంపన్ తుఫానుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొందని, ఆ బాధ తమకు తెలుసని అన్నారు.

మమతా బెనర్జీకి కేసీఆర్ ధన్యవాదాలు

మమతా బెనర్జీకి కేసీఆర్ ధన్యవాదాలు

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణా ప్రజలకు పశ్చిమబెంగాల్ ప్రజలు అండగా ఉంటారని మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్.. మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. సాయం అందించనందుకు తెలంగాణ ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి 10 కోట్ల రూపాయలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ. 15 కోట్లు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన మూడు నెలల జీతాన్ని వరద బాధితుల సాయం కోసం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు నెలల జీతాన్ని సాయంగా అందించనున్నారు.

కేసీఆర్ పిలుపుతో కదిలిన సినీతార లోకం

కేసీఆర్ పిలుపుతో కదిలిన సినీతార లోకం


సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఇక సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున విరాళాలు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి, మహేశ్ బాబు రూ. కోటి అందజేయగా, అక్కినేని నాగార్జున రూ. 50 లక్షలు అందించారు. హీరో ప్రభాస్ కూడా రూ. కోటి విరాళం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, హీరో రామ్ రూ. 25 లక్షలు, యువ హీరో విజయ్ దేవరకొండ రూ. 10 లక్షల విరాళం అందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎన్ రాధాకృష్ణ రూ. 10 లక్షల చొప్పున ప్రకటించారు. హరీశ్ శంకర్ రూ. 5 లక్షలు, అనిల్ రావిపూడి రూ. 5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు.

English summary
Telangana CM Thanks WB CM Mamata Banerjee For Contribution Towards Flood Relief Work In State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X