హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్‌పాల్‌లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు మండిపడుతున్నారు. హస్తం గుర్తుపై గెలిచిన నేతలు కారెక్కుతుండటం సరికాదంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అంటూ గులాబీ గూటికి చేరుతుండటం హాస్యాస్పదమంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంలో సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు టైప్ చేస్తున్నారని ఫైరవుతున్నారు. త్వరలోనే కోర్టుకు వెళతామని, లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తామంటున్నారు.

పవన్ కల్యాణ్ అలా మాట్లాడితే ఊరుకోం..! జనసేనానిపై తెలంగాణలో కేసుపవన్ కల్యాణ్ అలా మాట్లాడితే ఊరుకోం..! జనసేనానిపై తెలంగాణలో కేసు

 గవర్నర్ కు ఫిర్యాదు

గవర్నర్ కు ఫిర్యాదు

పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తూ 5 పేజీల లేఖను అందించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోందని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతుండటాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లుగా విడుదల చేసిన ప్రతులన్నీ సీఎం కార్యాలయం నుంచే వెలువడ్డాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.

లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తాం.. రాష్ట్రపతిని కలుస్తాం

లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తాం.. రాష్ట్రపతిని కలుస్తాం


ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై లోక్‌పాల్‌లో కేసు వేస్తామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రగతి భవన్ వేదికైందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కో ఎమ్మెల్యేను 10 నుంచి 15 కోట్ల రూపాయలకు కొంటున్నారని ఆరోపించారు. పార్టీ మారే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు ప్రగతి భవన్ లో టైప్ చేయడం విడ్డూరమని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మార్పిడిలకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌, మండలి ఛైర్మన్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పార్టీ ఫిరాయింపుల్లో సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ చేసే అక్రమాలను ప్రశ్నించకుండా ఉండటానికే ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కు ఇదే చివరి హెచ్చరిక..!

కేసీఆర్ కు ఇదే చివరి హెచ్చరిక..!

పార్టీ ఫిరాయింపులతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలపై వత్తిడి తెస్తూ గులాబీ తీర్థం పుచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న ఇలాంటి అక్రమాలను ఇకనైనా ఆపాలని.. ఇదే ఆయనకు చివరి హెచ్చరిక అంటూ ఫైరయ్యారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపులను ఎండగట్టడానికి దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

English summary
The Telangana Congress Leaders approached the Governor E S L Narasimhan to complain against the TRS government after nine of its MLAs announced their decision to join the State's governing party since the beginning of this month. And they were ready to complaint in Lokpal also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X