హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.

|
Google Oneindia TeluguNews

కరోనా చర్యల్లో వైఫల్యం, ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగునీరు వ్యవహారంలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడినితీవ్రతరం చేసింది. వరుస ప్రెస్ మీట్లు, భారీ క్యాంపెయిన్లతో దూసుకుపోతున్నది. అయితే, కొందరు నేతలు మాత్రం అతితీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సీఎం, మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను ఉద్దేశించి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..

రాష్ట్రం పేరు మార్చాలి..

రాష్ట్రం పేరు మార్చాలి..


ఆరేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ.. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక తెలంగాణను ప్రజలకు అందించిందని, తన తప్పుడు విధానాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశాడని జగ్గారెడ్డి మండపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన అప్పుల కారణంగా ప్రతి ఒక్కరూ బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, తెలంగాన పేరును ‘అప్పుల రాష్ట్రం'గా మార్చాల్సి ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రితోపాటు ఇద్దరు కీలక మంత్రులపైనా జగ్గారెడ్డి ఫైరయ్యారు.

షాకింగ్: హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతికి కరోనా.. తెలంగాణలో కొత్తగా 1676 కొత్త కేసులు, 10 మరణాలు..షాకింగ్: హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతికి కరోనా.. తెలంగాణలో కొత్తగా 1676 కొత్త కేసులు, 10 మరణాలు..

మంత్రి కాదు.. సీఎంకు చెంచా..

మంత్రి కాదు.. సీఎంకు చెంచా..

ఉస్మానియా ఆస్పత్రిలోకి డ్రైనేజీ నీళ్లు పొంగుకొచ్చిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. రూ.500 కోట్లు పెట్టి సచివాలయం కూలగొడుతోన్న సీఎం కేసీఆర్.. పేదలకు దిక్కైన ఉస్మానియా ఆస్పత్రిని గాలికొదిలేశారెందుకంటూ ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కట్టకుండా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీనే అని, కోర్టులో కేసులు వేయకపోతే ఏడాది తిరిగేలోపు కొత్త ఉస్మానియాను కట్టి తీరుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాలు విసిరారు. ఆ వ్యాఖ్యలకు కౌంటరిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. శ్రీనివాస్ గౌడ్ అసలు మంత్రే కాదని, ముఖ్యమంత్రి చెప్పింది చేయడానికున్న చెంచా మాత్రమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మమత భర్త.. గౌడ్ చరిత్ర..

మమత భర్త.. గౌడ్ చరిత్ర..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఉద్యోగ సంఘాల నేత కావడం, ఇప్పటికీ ఉద్యోగులతో ఆయన దగ్గరి సంబంధాలు కొనసాగిస్తుండటం తెలిసిందే. అయితే, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కీలక నేత మమత భర్తకు ప్రభుత్వం సర్వీసు పొడగించడం వివాదాస్పదమైంది. శ్రీనివాస్ గౌడ్ చక్రం తిప్పడం వల్లే మమత భర్త సర్వీసు పొడగింపుపై ఉత్తర్వులు జారీ అయ్యాయనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ప్రస్తావించారు. ‘‘ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే శ్రీనివాస్ గౌడ్-మమత అనే ఉద్యోగి ఎందుకు స్వీట్ తినిపిస్తారు? మమత భర్త పదవీ విరమణ చేసినా, సర్వీసును ఎలా పొడిస్తారు? శ్రీనివాస్ గౌడ్ మంత్రికాదు.. పచ్చి బ్రోకర్. టైమ్ వచ్చినప్పుడు అతని చరిత్ర బయటపెడతా..'' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

దంగల్ కాదు.. పహిల్వాన్‌గిరీ వద్దు..

దంగల్ కాదు.. పహిల్వాన్‌గిరీ వద్దు..

ఉస్మానియా ఆస్పత్రిలోకి డ్రైనేజీ నీళ్లు పొంగుకొచ్చి, రోగులు ఇబ్బందులు పడటం, పీపీఈ కిట్లు కొట్టుకుపోవడం తదితర ఘటనలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలకు దిగారు. ‘‘మంత్రి తలసానిని నేను ఒక్కటే అడగదల్చుకున్నా.. ఉస్మానియాలో పర్యటించిన మీరు.. గాంధీ ఆస్పత్రికి ఎందుకు పోలేదు? మనం చేసేది దంగల్ కాదు.. పహిల్వాన్ గిరీ బంద్ చెయ్..''అని హెచ్చరించారు. తెలంగాణలో కొందరు మంత్రులు సీఎం కేసీఆర్ కు వెట్టిచాకిరీ చేసేవాళ్లేనని, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
కేసీఆర్ వైఫల్యంపై ప్రజల్లోకి..

కేసీఆర్ వైఫల్యంపై ప్రజల్లోకి..

కరోనా కట్టడి, చికిత్సలో కేసీఆర్ సర్కారు దారుణంగా ఫెయిలైందని, దేశంలోనే అత్యధిక పాజిటివిటీ రేటు కలిగిన రెండో రాష్ట్రం తెలంగాణ(18.85 శాతం) అని, ప్రతి 10 లక్షల మందిలో కేవలం 5,350 మందికి మాత్రమే టెస్టులు చేస్తూ అధమస్థితిలో ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణే అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేసీఆర్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అదేసమయంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మద్దతు ఇచ్చేందుకుగానూ కాంగ్రెస్ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. ఈనెల 18న(శనివారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ‘స్పీకప్ తెలంగాణ' కార్యక్రమం ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనల్ని తెలియజేయొచ్చని టీపీసీసీ పేర్కొంది.

English summary
sangareddy congress mla t.jayaprakash reddy alias jagga reddy sensational remarks on cm kcr and minister srinivas goud. claims that minister are doing slavery to cm. telangana congress campaign against trs govt on covid-19 issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X