హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ అరెస్ట్ : త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టారు: కొడంగ‌ల్ లో టెన్ష‌న్..టెన్ష‌న్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018: Breaking: Revanth Reddy Arrested | రేవంత్ అరెస్ట్ | Oneindia Telugu

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ కోస్గి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని రేవంత్ పిలుపునివ్వ‌టంతో..టిఆర్ య‌స్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇసి ఆదేశాల మేర‌కు కొడంగ‌ల్ పోలీసు స్టేష‌న‌లో రేవంత్ పై కేసు న‌మోదైంది. రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని రేవంత్ భార్య ఆందోళన చెందుతున్నారు. పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, ఇంటి తలుపులు పగులగొట్టి రేవంత్‌ను తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకోబోమని, సీఎం కేసీఆర్‌ ఓటమి భయంతోనే దాడులు చేయిస్తున్నారని రేవంత్ భార్య ఆరోపిస్తున్నారు..

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం రేప‌టితో ముగుస్తున్న స‌మ‌యంలో ఉద్రిక్త‌త‌లు మొద‌ల‌య్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఆరెస్ట్ చేసారు. సీఎం కేసీఆర్‌ నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని ఈసీకి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Telangana Congress Working President Revanth Reddy Arrest..!

ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్‌ తెలిపారు. రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని రేవంత్ భార్య ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చినట్లు రేవంత్ అనుచరులు ఆరోపిస్తున్నారు. కాగా రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

144 సెక్ష‌న్ : ఓట‌మి భ‌యంతోనే దాడులు..

ఇప్పటికే బొమ్మరాస్‌పేటలో నేడు సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు. పోలీసు బ‌ల‌గాలు పెద్ద ఎత్తును కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్నాయి. రేవంత్ అరెస్ట్ తో అక్క‌డ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. పోలీసు ల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న భర్తను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, ఇంటి తలుపులు పగులగొట్టి రేవంత్‌ను తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. త‌మ‌ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకోబోమని, సీఎం కేసీఆర్‌ ఓటమి భయంతోనే దాడులు చేయిస్తున్నారని గీత ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌..కొడంగ‌ల్ లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇక్క‌డ గెలుపు రెండు పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం కావ‌టంతో...కొడంగ‌ల్ లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

English summary
Telangana Congress Working President Revanth Reddy Arest. As per Election Commission orders Police arrest Revanth. Congress party leaders and Revanth wife Geetha protest on Police action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X