హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గుర్తించారు . దీంతో ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారి, కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ ,నల్గొండ ,కామారెడ్డి జిల్లాల్లో ఆయనకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు.

కరోనాను వదలని కరెప్షన్ కింగ్స్ .. కేంద్రానికి 40వేల దాకా ఫిర్యాదులు , నివేదిక కోరిన మోడీ !!కరోనాను వదలని కరెప్షన్ కింగ్స్ .. కేంద్రానికి 40వేల దాకా ఫిర్యాదులు , నివేదిక కోరిన మోడీ !!

కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు .. 2.12 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు .. 2.12 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

హైదరాబాద్ , నల్గొండ, కామారెడ్డి జిల్లాలలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కామారెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ (డిఎస్పి) టి లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. 2.12 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను హైదరాబాద్ నివాసం నుంచి ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నివాసం నుంచి అధిక సంఖ్యలో బుల్లెట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కామారెడ్డి ఇన్స్పెక్టర్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది .

 క్రికెట్ బెట్టింగ్ నిందితులకు బెయిల్ ఇవ్వటానికి లంచం డిమాండ్ కేసు

క్రికెట్ బెట్టింగ్ నిందితులకు బెయిల్ ఇవ్వటానికి లంచం డిమాండ్ కేసు


క్రికెట్ బెట్టింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి కామారెడ్డి ఇన్స్పెక్టర్ జగదీష్ నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిందితులను బెయిల్‌పై విడుదల చేసినందుకు రూ .1.39 లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ జగదీష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో జగదీష్ ఇంట్లో తనిఖీలు చేయగా 34 లక్షల రూపాయల నగదును, బంగారాన్ని వెండిని ఏసీబీ అధికారులు గుర్తించారు.

 తీగ లాగితే కదులుతున్న డొంక.. డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు

తీగ లాగితే కదులుతున్న డొంక.. డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు

ఈ కేసుతో సంబంధమున్న కామారెడ్డి సిఐ, ఎస్ఐ, మధ్యవర్తి లను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారించగా అందులో కొంత నగదు కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణకి చెందినదని సిఐ పేర్కొన్నారు . ఇంకా ఈ కేసులో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన డిఎస్పి లక్ష్మీనారాయణ నివాసంలో అధికారులు సోదాలు జరిపారు .

ఆయా జిల్లాలలో కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ

ఆయా జిల్లాలలో కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ

డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆయా జిల్లాలలో 17 చోట్ల వ్యవసాయ భూములు, 5 ఖాళీ ఇళ్ల స్థలాలు, మిర్యాలగూడ , తిరుమలగిరి ,సరూర్నగర్, వంటి ప్రాంతాలలో భవనాలతోటు బంగారము, నగదు ఉన్నట్లుగా ఎసిబి అధికారులు గుర్తించారు. వాటి విలువ 2.12 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అంతే కాదు ఆయన వద్ద అదనంగా గుర్తించిన బుల్లెట్లు, గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ ఇన్స్పెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

English summary
Anti Corruption Bureau (ACB) officials arrested the Kamareddy Deputy Superintendent of Police (DSP), T Lakshminaryana after conducting raids at his residence in Hyderabad, Nalgonda and Kammareddy on Sunday. The ACB officials seized documents from Lakshminaryana’s Hyderabad residence linking the officer to illegal assets worth Rs 2.1 crore. Police also found uncounted bullets from the residence of the DCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X