హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"నా ఓట్" కు ఏమైంది..! పెద్ద ఎత్తున ప్రచారం.. ఎన్నికల సమయానికి తుస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎలక్షన్లకు సర్వం సిద్ధమని ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. తీరా ఎన్నికల సమయానికి కొంత బేజారయినట్లు కనిపించింది. ఓటర్లు సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్, ఎస్సెమ్మెస్ ఫెసిలిటీ, యాప్ తదితర వాటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన "నా ఓట్" యాప్.. పోలింగ్ నాడు దెబ్బ కొట్టడం చర్చానీయాంశమైంది.

నా ఓట్ యాప్ పై విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లకు అవగాహన కల్పించింది ఈసీ. తీరా సమయానికి ఆ యాప్ పనిచేయకుండా పోయింది. పోలింగ్ కేంద్రాల సమాచారం, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి, నియోజకవర్గాలు / అభ్యర్థుల వివరాలు తదితర సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. దాంతో చాలామంది ఓటర్లు తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే సరిగ్గా పోలింగ్ నాడు ఈ యాప్ మొరాయించడంతో డౌన్ లోడ్ చేసుకున్న ఓటర్లు నిరాశ చెందారు.

telangana election naa vote app not work on polling day

నా ఓట్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రం దగ్గర ఎంతమంది ఓటర్లు క్యూ లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. తద్వారా సమయం వృధా కాకుండా.. క్యూ కాస్తా తగ్గాక వెళ్లొచ్చని ఓటర్లు డిసైడ్ కావొచ్చు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ ఉంటుందనే కారణంతో చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారనే వాదనలున్నాయి. దాంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎంతమేర క్యూ ఉందనే విషయం ఓటర్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా నా ఓట్ యాప్ తీర్చిదిద్దారు. ఓటింగ్ పెంచాలనే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తీసుకొచ్చిన ఈ యాప్.. పోలింగ్ నాడు తుస్సుమనడం గమనార్హం.

English summary
telangana election commission "naa vote app" doesn't work on polling day. Voters are disappointed with non working of naa vote app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X