హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Encounter: బీజేపీ నుంచి ఫస్ట్ రియాక్షన్: జై తెలంగాణ పోలీస్..2019లో అత్యుత్తమ చర్య: ఉమా భారతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంలో భారతీయ జనతా పార్టీ నుంచి మొట్టమొదటి సారిగా స్పందన వ్యక్తమైంది.. అది కూడా సానుకూలంగా. బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి ఈ ఎన్ కౌంటర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ పోలీస్ అంటూ నినదించారు. ఈ ఏడాది మొత్తానికీ అత్యుత్తమ పోలీసు చర్యగా ఆమె అభివర్ణించారు.

Saaho Sajjannar: ఆనంద డోలికల్లో తెలంగాణ: సజ్జన్నార్ చిత్రపటానికి పాలాభిషేకం: బాణాసంచా కాల్చుతూ..Saaho Sajjannar: ఆనంద డోలికల్లో తెలంగాణ: సజ్జన్నార్ చిత్రపటానికి పాలాభిషేకం: బాణాసంచా కాల్చుతూ..

ఉమా భారతి.. వరుస ట్వీట్లు

వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం కేసులో నలుగరు నిందితులు మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమాచారం తెలిసిన వెంటనే- తన ట్వీట్లకు పని చెప్పారు ఉమా భారతి. ప్రస్తుతం ఆమె గంగా యాత్రను నిర్వహిస్తున్నారు. గంగానది జన్మించిన స్థలం నుంచి సముద్రంలో కలిసే ప్రాంతం వరకూ ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్ లో గంగానదీ తీరంలో పర్యటిస్తున్నారు.

Recommended Video

Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో

దిశ హత్యోదంతం కలచి వేసింది..

ప్రస్తుతం తాను గంగాయాత్రలో ఉన్నానని, గంగానదీ తీరం వెంట సాగుతుండటం వల్ల ఇంటర్ నెట్, ఫోన్ కాల్స్ కు దూరంగా ఉంటున్నానని చెప్పారు. వెటర్నరి డాక్టర్ హత్యోదంతం తనకు ఆలస్యంగా తెలిసిందని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. ఇందుకు బాధ్యులైన నలుగురినీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని పార్టీ నాయకులు తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. కిరాతక చర్యలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయడం సరైన చర్య అని ఉమా భారతి అన్నారు.

మృగాళ్లకు భయాన్ని కలిగించడానికి..

ఈ ఎన్ కౌంటర్ తరువాత దేశంలో మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని తాను ఆశిస్తున్నట్లు ఉమా భారతి చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మానవ మృగాళ్లకు సరైన గుణపాఠం నేర్పించడానికి ఈ ఎన్ కౌంటర్ ఉదంతం సహాయ పడుతుందని అన్నారు. భవిష్యత్తులో అత్యంత కిరాతకంగా మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక దాడులకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలే పడతాయనే హెచ్చరికను పంపించినట్టయిందని వ్యాఖ్యానించారు.

జై తెలంగాణ పోలీస్ అంటూ..

ఈ సందర్భంగా ఆమె తెలంగాణ పోలీసులను అభినందించారు. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది కూడా ప్రశంసలకు అర్హుడే అవుతారని అన్నారు. తాను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఉమా భారతి ట్వీట్ చేశారు. జై తెలంగాణ పోలీస్ అని నినదించారు. 2019లో అత్యుత్తమ పోలీస్ చర్యగా అభివర్ణించారామె. ఈ ఘటనతో మహిళలకు భద్రత కల్పిస్తామనే భరోసాను ఇచ్చినట్టయిందని అన్నారు.

తెలంగాణ పోలీసులను చూసి..

ఈ ఎన్ కౌంటర్ ఘటనను చూసి మిగిలిన రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా స్ఫూర్తి పొందుతారని తాను ఆశిస్తున్నట్లు ఉమా భారతి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కూర్చున్న పెద్దలు.. ఈ ఉదంతాన్ని అనుసరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఉన్న నిందితులు, నేరస్తులను శిక్షించడానికి తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఘటనతో మేల్కొంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

English summary
Bharatiya Janata Party (BJP) senior leader Uma Bharti on Friday hailed the Telangana police after personnel of the force killed the four accused in Telangana rape-murder case in cross-firing on Friday morning. "This is the biggest incident in the 19th year of this century that will guarantee women's safety," Uma Bharti tweeted in Hindi. She said that all the police officers and policemen who executed this task deserve greetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X