హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూన్ 30 వరకు తెలంగాణలో లాక్‌డౌన్: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే, ఇది కంటైన్మెంట్ జోన్లకే వర్తించనుంది. ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల జూన్ 7 వరకు ప్రస్తుత లాక్‌డౌన్ స్థితిని కొనసాగించనున్నారు.

కంటైన్మెంట్ జోన్లు మినహా..

కంటైన్మెంట్ జోన్లు మినహా..


తాజా లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల
నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో ఆదివారం చర్చలు
జరిపారు. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను చేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Recommended Video

Lockdown 5 : Lockdown 5.0 Extended Till June 30, Central Government Issues New Guidelines
కర్ఫ్యూ సడలింపు, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత

కర్ఫ్యూ సడలింపు, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత

కాగా, రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేశారు.

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో ఇప్పటి వరకు 2499 కరోనా కేసులు నమోదు కాగా, 77 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1010 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో కరోనా..

దేశంలో కరోనా..


ఇక దేశంలో ఇప్పటి వరకు 1,82,990 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 87,099 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90,692 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5,188 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలోనే 2197 మంది మరణించారు. ఇక్కడ 65,184 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 34,890 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. మిగితావారు డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కేంద్రం కూడా పలు సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

English summary
Telangana state government on Sunday extended Covid-19-induced lockdown till June 7 outside the containment zones with more relaxations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X