హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, కేసీఆర్ దోస్తాన తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు..!మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలను పోతిరెడ్డి పాడు అంశం కుదిపేస్తోంది. శ్రీశైలంలోని అదనపు మిగులు జలాలను పోతిరెడ్డి పాడుకు తరలించుకుంటే తప్పేంటని ఆంధ్రప్రవేశ్ కు వత్తాసు పలకడం ఏంటని తెలంగాణ ఎంపీలు ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో నీళ్లు, నిధులు కాపాడాలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలను ఉద్దరిస్తాడని కాదని పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అందుకేనా..? కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన ఉత్తమ్..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అందుకేనా..? కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన ఉత్తమ్..

పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వాదులం అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చామని, అప్పటి నుంచైనా తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత చంద్రశేఖర్ రావు మీద లేదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. జగన్, చంద్రశేఖర్ రావు దోస్తాన తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు అవుతుందని, జగన్ అసెంబ్లీ లో పోతిరెడ్డిపాడు పై ప్రకటన చేసిన తర్వాత కూడా చంద్రశేఖర్ రావు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పైగా జగన్ తో చంద్రశేఖర్ రావు ఉదాసీనంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను బలితీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు కాంగ్రెస్ ఎంపీలు. ఇద్దరు సీఎం లు పోతిరెడ్డిపాడు మీద చర్చించికుని కుమ్మక్కు అయ్యారా అని వారు సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణ ఎడారవుతుంటే చూస్తూ ఊరుకోం.. పార్లమెంట్ లొ పోరడాతామన్న కాంగ్రెస్ ఎంపీలు..

తెలంగాణ ఎడారవుతుంటే చూస్తూ ఊరుకోం.. పార్లమెంట్ లొ పోరడాతామన్న కాంగ్రెస్ ఎంపీలు..

జలాల తరలింపు అంశం చంద్రశేఖర్ రావు ఇంటి సమస్య కాదని, తెలంగాణ రైతులు సమస్యని, కాళేశ్వరం కంటే రెండింతలు నీరు ఏపీ తరలించుకుపోయేందుకు రంగం సిద్దం చేస్తుంటే చంద్రశేఖర్ రావు ఎందుకు మౌనంగా చూస్తున్నారని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు కుట్రపూరితంగా తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడని, ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీరు వదిలిపెట్టి గోదావరి నీళ్ల పై మాట్లాడటానికి చంద్రశేఖర్ రావుకు విచక్షణ కావాలని ధ్వజమెత్తారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ రోజున పోతిరెడ్డిపాడు కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు.

జూన్ రెండున నిరశన చేస్తాం.. తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడతామన్న కోమటిరెడ్డి..

జూన్ రెండున నిరశన చేస్తాం.. తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడతామన్న కోమటిరెడ్డి..

అంతే కాకుండా జూన్ రెండవ తారీఖులన ఎస్ఎల్బీసి టన్నెల్ దగ్గర నిరసన దీక్ష చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోందని, భువనగిర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ను ఎడారిగా మార్చే ఏపి ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అసలు ఆ ప్రభుత్వ ఉత్తర్వుకు ప్రధాన కారకుడు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావే నని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 70శాతం ఐపోయిన ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయని అసమర్థుడు చంద్రశేఖర్ రావని ఆగ్రహం వ్యక్తం చేసారు కోమటి రెడ్డి. చంద్రశేఖర్ రావు బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని కోమటి రెడ్డి స్పష్టం చేసారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ బంతి భోజనం.. తర్వాతే జగన్ జీవో విడుదల చేసాడన్న రేవంత్ రెడ్డి..

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ బంతి భోజనం.. తర్వాతే జగన్ జీవో విడుదల చేసాడన్న రేవంత్ రెడ్డి..

ఇదిలా ఉండగా ఏపీ విడుదల చేసిన పోతిరెడ్డి పాడు జీవో పై ప్రధానిని కలుస్తామని, పార్లమెంట్ లో ఇదే అంశానికి వ్యతిరేకంగా పోరాడుతామని మల్కాజిగిరి ఎంపీ
రేవంత్ రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు పై వీరోచితపోరాటం చేసినట్లు చంద్రశేఖర్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని, సెప్టెంబర్13, 2005న పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44వేల కు జీవో ఇచ్చారని, ఆనాడు చంద్రశేఖర్ రావు దాని మీద ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆగస్ట్ 20, 2006న చంద్రశేఖర్ రావు, అలె నరేంద్ర కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చేసారని, ఆనాడు వారు పోతిరెడ్డిపాడు గురించి కనీసం పెదవి విప్పలేదని గుర్తు చేసారు. పోతిరెడ్డిపాడు పై ఢిల్లీ, నుంచి గల్లీ వరకు గళాన్ని వినిపించింది దివంగత పీ. జనార్దన్ రెడ్డని అన్నారు. జగన్ ఇచ్చిన 203జీవో వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని, చంద్రశేఖర్ రావుతో బంతి భోజనం చేసిన తర్వాతే జగన్ జీవో విడుదల చేసారని రేవంత్ రెడ్డి చెప్పారు.

English summary
Telangana MPs have raised voice that Andhra Pravesh should not take any surplus water from Srisailam to Potireddy's dam. Uttam Kumar Reddy and Revant Reddy along with Komatireddy Venkatreddy on Monday reacted to the comments made by CM Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X