హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఏర్పడింది..! తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రకటన..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#TRSPartyFormationDay : త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఏర్పడింది : కేటీఆర్ || Oneindia Telugu

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి సంబురాలు అంబరాన్ని అంటాయి. గులాబీ పార్టీ 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జెండాను ఆవిష్కరించి వందన స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. మే 23న వచ్చే ఫలితాల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉక్కు సంకల్పానికి 18 ఏండ్లు..!బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారా..? ఉక్కు సంకల్పానికి 18 ఏండ్లు..!బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారా..?

'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పనిచేసిన తెలంగాణ వాదులందరికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని.. ఆనాడు కేసీఆర్‌ మూడు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో దిగారని కేటీఆర్ గుర్తు చేసారు.

Telangana formed on the foundations of sacrifices.!KTR statement in Telangana Bhavan..!!

డిప్యూటీ స్పీకర్‌ పదవికి, శాసన సభ సభ్యత్యానికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమానికి కేసీఆర్‌ పురుడు పోశారని, ఉద్యమం ప్రారంభించిన అనంతరం ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన ధైర్యం చంద్రశేఖర్ రావుదని కేటీఆర్ అన్నారు.

ఉద్యమ తొలినాళ్లలో అన్ని ప్రతికూల పరిస్థితులేనని, 13 ఏళ్లు పోరాటం చేసి చంద్రశేఖర్ రావు ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని, తక్కువ కాలంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించినందుకు చంద్రశేఖర్ రావును నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారని అన్నారు. ఈ 18 ఏళ్లలో తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస ఎదిగిందని కేటీఆర్‌ అన్నారు.

English summary
The 18th birthday celebrations of the pink party were held in Telangana Bhavan. Party working president Kalvakuntla Taraka Rama Rao was inaugurated by the flag. Ministers, MLAs, MLCs and party lines participated in the celebrations. Ktr party addressed to the trs cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X