హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబులకు గుడ్ న్యూస్: బార్లకు బార్లా..: క్లబ్బులకు కూడా.. కానీ ఈ కండీషన్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి వల్ల గత 7 నెలల నుంచి బార్లు, క్లబ్బులు మూతపడిన సంగతి తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో విభాగానికి అనుమతి ఇస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు బార్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో వైరస్ కేసులు తీవ్రత దృష్ట్యా వాటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీంతో శనివారం నుంచి బార్లు, క్లబ్బులు ఓపెన్ అవబోతున్నాయి.

7 నెలల తర్వాత..

7 నెలల తర్వాత..

లాక్ డౌన్ వల్ల మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రంలో బార్లు క్లోజ్ చేశారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా బస్సులు, వైన్ షాపులను తొలుత స్టార్ట్ చేశారు. రెస్టారెంట్లు, హోటళ్లకు కూడా అనుమతి ఇచ్చారు. ఆలయాలకు పర్మిషన్ ఇవ్వగా.. విద్యార్థుల పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బార్లు, క్లబ్బులు తెరువాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పర్మిట్ రూమ్‌లకు మాత్రం నో..

పర్మిట్ రూమ్‌లకు మాత్రం నో..

ప్రభుత్వం బార్లకు అనుమతి ఇచ్చింది కానీ.. పర్మిట్ రూమ్‌లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో గ్యాదరింగ్ చేయొద్దని స్పష్టంచేసింది. మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్‌కు కూడా అనుమతి లేదని.. కరోనా వైరస్ నిబంధనలను తప్పనిసరి పాటించాలని పేర్కొన్నది. భౌతిక దూరం పాటిస్తూ.. బార్లను తెరచుకోవాలని యాజమాన్యాలకు స్పష్టంచేసింది.

థర్మల్ స్క్రీనింగ్..

థర్మల్ స్క్రీనింగ్..

బార్లు, క్లబ్బుల్లో కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎట్టి పరిస్థితుల్లో జనం గుమి గూడడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కచ్చితంగా క్యూ పద్ధతి పాటించాలని.. పూర్తి శుభ్రమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నది. ప్రతి ఒక్కరికీ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. బార్లలో పనిచేసే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని నిర్దేశించింది.

ఫేస్ షీల్డ్ తప్పనిసరి..

ఫేస్ షీల్డ్ తప్పనిసరి..


బార్లలో పనిచేసే వారికి ఫేస్ షీల్డ్ వాడాలని.. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బార్ పరిసరాలు శానిటైజ్ చేయాలని సూచించింది. ప్రతి కస్టమర్ వచ్చే ముందు, వెళ్లిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేయాలని తప్పనిసరిగా చెప్పింది. బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సజెస్ట్ చేసింది.

Recommended Video

Durgam Cheruvu Cable Bridge Inaugurated by KTR | Oneindia Telugu
ఐపీఎల్ సీజన్ కావడంతో..

ఐపీఎల్ సీజన్ కావడంతో..


ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో కంటే బయట చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సమయంలోనే బార్లకు అనుమతి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు. అందుకే నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. మరోవైపు మందుబాబులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telangana bars open: Telangana government on Friday issued orders permitting to re-open bars, clubs and tourism bars across the state with COVID-19 regulations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X