హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో చోటు చేసుకున్న దళిత మహిళ సమత అత్యాచారం, హత్యోదంతంపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసును త్వరితగతిన విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. సమత హత్యోదంతం కేసు విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇదివరకే పంపించిన ప్రతిపాదనలపై తెలంగాణ హైకోర్టు ఆమోదముద్ర వేసింది.

మామిడితోపులో సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం: అత్యాచారం.. హత్యగా నిర్ధారణ: ఖాళీ మద్యం బాటిల్మామిడితోపులో సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం: అత్యాచారం.. హత్యగా నిర్ధారణ: ఖాళీ మద్యం బాటిల్

అయిదవ అదనపు సెషన్స్ ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. ప్రత్యేక న్యాయస్థానంగా..

అయిదవ అదనపు సెషన్స్ ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. ప్రత్యేక న్యాయస్థానంగా..

హైకోర్టు ఆమోదాన్ని వ్యక్తం చేసిన కొద్ది సేపటికే.. న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై ఉత్తర్వులను జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా మార్పులు చేసినట్లు వెల్లడించారు. అయిదవ అదనపు సెషన్స్ జడ్జి.. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. సమత హత్యోదంతం కేసు విచారణ కోసమే దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా- సమత హత్యోదంతం కేసుపై ప్రతిరోజూ విచారణ కొనసాగిస్తారు.

వెటర్నరి డాక్టర్ దిశ తరహాలోనే..

వెటర్నరి డాక్టర్ దిశ తరహాలోనే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ సమతపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. కిందటి నెల 24వ తేదీన ఈ ఉదంతం చోటు చేసుకుంది. శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశ హత్యకు మూడో రోజుల ముందే ఈ అమానవీయ ఘటన నమోదైంది. సమత, ఆమె భర్త కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నివసిస్తూ, బెలూన్లను అమ్ముకుని జీవనం సాగించేవారు.

ఎల్లాపటార్ లో మృతదేహం..

ఎల్లాపటార్ లో మృతదేహం..


జీవనోపాధిలో భాగంగా లింగాపూర్ మండలంలోని ఎల్లపటార్ గ్రామానికి వెళ్లిన సమత.. మళ్లీ తిరిగి రాలేదు. ఉదయం వెళ్లిన తన భార్య జాడ తెలియరాకుండా పోవడంతో ఆమె భర్త లింగాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని చోట్లా గాలించగా.. మరుసటి రోజు ఉదయం ఎల్లపటార్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో సమత మృతదేహం లభించింది. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా నిర్ధారించారు.

సమతపై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయాలంటూ..

సమతపై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయాలంటూ..


సమత హత్యోదంతంలో ఎల్లపటార్ గ్రామానికే చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. వారిని కూడా వెటర్నరి డాక్టర్ దిశ నిందితుల తరహాలోనే ఎన్ కౌంటర్ చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. రోజువారీ తరహాలో సమత హత్యోదంతానికి సంబంధించిన కేసు విచారణను చేపట్టడానికి ఈ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

English summary
Telangana Government created a Special Court for inquiry for Samatha rape and murder case Kumarambheem Asifabad district, Law minister of Telangana Indrakaran Reddy announced the Special Court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X