హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెలవులు పెరిగాయోచ్.. స్కూళ్లు తెరిచేది జూన్ 1న కాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేది జూన్ 1వ తేదీన కాదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ కావాల్సి ఉంది. కానీ వేసవి సెలవులను మరో పది రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బాప్‌రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!బాప్‌రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!

సెలవులు మళ్లీ పెరిగాయోచ్..!

సెలవులు మళ్లీ పెరిగాయోచ్..!

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ మేరకు జూన్ 1వ తేదీ నుంచి కాకుండా.. గతంలో మాదిరిగానే జూన్ 12వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

గతంలో ఎప్పుడైనా జూన్ 12వ తేదీనే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా.. వేసవి సెలవుల్లో మార్పు చేశారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సెలవులను కాస్తా ముందుకు జరిపారు. ఆ క్రమంలో జూన్ 1వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, మళ్లీ ఎప్పటిలాగే జూన్ 12వ తేదీకి పొడిగించారు.

ఎండలు బాబోయ్..!

ఎండలు బాబోయ్..!

వేసవి తీవ్రత కారణంగా స్కూళ్లకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా పాఠశాలలు కూడా అవే ఉత్తర్వులను ఫాలో అవుతూ పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించాయి. జూన్ 1వ తేదీన మళ్లీ స్కూళ్లకు రావాలంటూ తెలిపాయి. కానీ ప్రభుత్వం తాజా ఆదేశాలతో జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి.

 ప్రభుత్వ ఆదేశాలతో పెరిగిన సెలవులు

ప్రభుత్వ ఆదేశాలతో పెరిగిన సెలవులు


పాత ఉత్తర్వుల ప్రకారం ఒకవేళ జూన్ 1వ తేదీన స్కూళ్లు తెరిచినా.. ఆ రోజు శనివారం వస్తోంది. ఆ మరునాడే ఆదివారం కావడంతో సెలవు దినం. అయితే జూన్ 4,5 తేదీల్లో రంజాన్ పండుగ కూడా రానుంది. ఇలా సగం రోజులు అలా సెలవులతోనే ముగిసిపోనున్నాయి. సో, జూన్ 1వ తేదీ కన్నా.. 12వ తేదీన రీఓపెన్ చేస్తే బాగుండనే వాదనలు వినిపించాయి. మొత్తానికి ప్రభుత్వం వేసవి సెలవులు పొడిగించే క్రమంలో జూన్ 12వ తేదీనే పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతుండటంతో స్కూళ్లకు సెలవులు పొడిగించడం అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు ఊరటనిచ్చే అంశం. వేడిగాలలు ఇంకా తగ్గకపోవడంతో పిల్లల్ని స్కూళ్లకు ఎలా పంపించాలని సతమతమవుతున్న తల్లిదండ్రలకు ప్రభుత్వ నిర్ణయం కాసింత రిలీఫ్‌నిచ్చింది.

English summary
Telangana Government Extended School Reopens Date to 12th June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X