హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు పెంచితే కఠిన చర్యలే .. తెలంగాణా సర్కార్ ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంటే ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో ప్రజలు ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోయారు .ఇక ఇది ఇలా ఉంటె ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామన్న పేరుతో ఫీజుల బలవంతపు వసూళ్లు చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ప్రైవేట్ స్కూళ్ళు ఫీజుల కోసం ఒత్తిడి పెడితే ఊరుకోబోమని స్పష్టం చేసిన తెలంగాణా సర్కార్ తాజాగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఫీజులు పెంచొద్దని ఉత్తర్వులు జారీ చేసింది .

 లాక్ డౌన్ లోనూ స్కూలు ఫీజులు ... లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చిన పేరెంట్ లాక్ డౌన్ లోనూ స్కూలు ఫీజులు ... లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చిన పేరెంట్

కరోనా ప్రభావంతో ప్రజలందరూ కష్ట కాలం అనుభవిస్తున్నారు. ఇక దీని ప్రభావం ఒక ఆరు నెలల పాటు అన్ని వర్గాల మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను కోరారు . ఇక నేడు అదే విషయం మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు . తాజాగా జరిగిన కేబినెట్ తీర్మానం నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ.

Telangana government strict orders.. No Raising fees in private schools

తల్లితండ్రుల దగ్గరనుండి కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే వసూలు చేయాలని, ఫీజులు పెంచొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు సెంట్రల్ బోర్డ్స్, ఇంటర్నేషనల్ బోర్డ్స్ పరిధిలో ఉన్న పాఠశాలలకు కూడా ఇది వర్తించనుంది అని తెలుస్తుంది . నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్కూల్స్ అయితే గుర్తింపు రద్దు చేస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక సెంట్రల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే వాటికి ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లను ఉపసంహరించుకుంటామని ఉత్తర్వులలో పేర్కొంది తెలంగాణా సర్కార్ .

Recommended Video

Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar

English summary
The Minister of Education, Sabitha Indra Reddy, yesterday asked private school owners not to raise fees under any circumstances under the ownership of private schools in the next academic year. Orders on the same were issued today. In the wake of the recent Cabinet resolution, the Ministry of Education has issued directives to not to increase the fees of private schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X