హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్, విచారణకు ఆదేశం

|
Google Oneindia TeluguNews

అమీర్‌పేట్ మెట్రో ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై ఇంజనీరింగ్ అధికారుల చేత విచారణ జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్రోలో ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అమీర్‌పేట్ మెట్రో ఘటనలో మహిళ మృతి చెందిన 24 గంటలకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఘటనపై మున్సిపల్ శాఖ మంంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ అధికారుల బృందంతో విచారణ జరిపించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.కాగా ఆదివారం అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌ క్రింద నిలబడి ఉన్న మౌనిక అనే మహిళపై స్టేషన్‌ పై కప్పు ప్రాంతం నుండి పెచ్చులు పడడంతో ఆమే అక్కడికక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే..

Telangana government takes serious action on metro accident.

ఈ ఘటనతో మెట్రో నిర్మాణం, భద్రత అంశాలపై ప్రజల్లో పలు అనుమానాలు, ఆందోళన తలెత్తాయి. మరోవైపు మెట్రో నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న మొదటి ప్రాజెక్టు కూడ కావడంతో ప్రభుత్వం జరిగిన సంఘటనను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రమాదంపై నిజానిజాలు వెలికి తీసేందుకు ఇంజనీరింగ్ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

English summary
Telangana government takes serious action on metro accident. and minister ktr ordered to enquiry with engineering officials on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X