హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం: వీఆర్వో వ్యవస్థ రద్దు..? రికార్డులపై కలెక్టర్లకు ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసినట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. రెవెన్యూ శాఖలో భారీగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొందరు అధికారులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చకు దారితీసింది.

Recommended Video

Telangana Assembly Monsoon Session : Corona Test Must For All MLAs Before Attending The Session

వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వీఆర్వో నుంచి రికార్డులలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డులు స్వాధీనం చేసుకోవాలని స్పష్టంచేశారు. సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్‌ పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు వీఆర్వోల నుంచి రికార్డులు తీసుకోవడంపై ఫోకస్ చేశారు.

telangana government will be Cancelled vro system..

తహశీల్దార్ల నుంచి వీఆర్వో అదరికి ఆదేశాలు అందాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు ధృవీకరించారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సర్వీస్ పరిస్థితి ఏంటి అని.. అలాగే ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని కోరుతున్నారు.

English summary
telangana government Cancelled vro system directions to collectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X