హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్‌డౌన్ ఎఫెక్ట్: కళతప్పిన నగరం.. నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు: వీడియో విడుదల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇక ఎక్కడో చైనాలో పుట్టని ఈ మహమ్మారి దాదాపు 200 దేశాలకు పైగా వ్యాపించింది. దీంతో చాలావరకు దేశాలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక భారత్‌లో కూడా క్రమంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 4వేల మార్క్‌ను టచ్ చేయగా ఈ మహమ్మారి బారిన పడి 137 మంది మృతి చెందారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఏపీ తెలంగాణల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 300 పైచిలుకే ఉన్నాయి. తెలంగాణలో 11 మంది మృతి చెందారు.

నిర్మానుష్యంగా హైదరాబాదు

నిర్మానుష్యంగా హైదరాబాదు

తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లినప్పటి నుంచి నిత్యం రద్దీగా కనిపించే హైదరాబాదు రోడ్లు అత్యంత నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఉద్యోగులంతా దాదాపుగా వర్క్‌ ఫ్రమ్ హోమ్ పద్దతిని పాటిస్తున్నారు. రోడ్లపై అక్కడక్కడ చెక్‌పోస్టులు మాత్రమే దర్శనిమిస్తున్నాయి. పోలీసులు మాత్రం నిత్యం రోడ్లపైనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రోడ్లపై కనిపించని ప్రజలు

రోడ్లపై కనిపించని ప్రజలు

లాక్‌డౌన్‌తో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడో సంక్రాంతికి నగరంలో రద్దీ తగ్గినట్లు కనిపించినప్పటికీ ప్రజలు మాత్రం రోడ్లపై కనిపిస్తూనే ఉంటారు. కానీ కరోనా కాలంలో మాత్రం ప్రజలు నగరంలోనే ఉన్నప్పటికీ ఎవరూ బయటకు రాకపోవడంతో కర్ఫ్యూను మించిన పరిస్థితి రహదార్లపై కనిపిస్తోంది. ఎప్పుడూ రద్దీగా కనిపించే అమీర్‌పేట్ ప్రాంతం మైత్రీవనంలో చీమ చిటుక్కుమన్న వినిపించేంతలా సైలెంట్‌గా మారిపోయింది. ఇక పంజాగుట్ట సర్కిల్ అసెంబ్లీ ఓల్డ్ సిటీలు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తాయి. కానీ అక్కడ ప్రజలు లేక సందడి లేక కళ తప్పాయి.

వీడియో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తాజాగా నగర పరిస్థితి ఎలా ఉందో చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యం సాఫ్‌వేర్ ఉద్యోగులతో కిటకిటలాడే హైటెక్ సిటీ, గచ్చిబౌలి మార్గాలు నిర్జీవంగా కనిపించాయి. ఒక్కరు కూడా బయట కనపడటం లేదు. నగరమంతా రద్దీగా ఉండే పలు ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా వీడియో చేశారు. అన్ని ప్రధాన కూడళ్లు చాలా నిర్మానుష్యంగా కనిపించాయి. లాక్‌డౌన్ అంటే ఇలాగుంటుందా అనేలా రహదారులను ఈ వీడియోలో చూపించడం జరిగింది.

English summary
Government of Telangana had released a video showing the city's current situation during the lockdown time, with roads going into silence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X