• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ కు తెలంగాణా సర్కార్ షాక్ .. వీఆర్ఎస్ కు బ్రేక్ వెనుక ఇదే రీజన్ !!

|

సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేసిన వీకే సింగ్ వాలంటరీ రిటైర్మెంట్ కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. గాంధీ జయంతి రోజున తనకు వీఆర్ఎస్ ఇచ్చి రిటైర్ చేయవలసిందిగా అభ్యర్థించిన ఆయన ఫైల్ ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. వీకే సింగ్ పై రెండు కేసుల్లో శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన విఆర్ఎస్ ను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆయన అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లుగా అక్టోబర్ 2న ఆయనకు నోటీసు పంపించింది.

ఏజెన్సీలో నిశ్శబ్ద యుద్ధం .. మావోయిస్ట్ ల కట్టడికి పోలీసుల త్రిముఖ వ్యూహం

తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర అసహనంలో వీకే సింగ్

తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర అసహనంలో వీకే సింగ్

గత కొంత కాలంగా వీ కే సింగ్ తెలంగాణ సర్కార్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రభుత్వానికి నేరుగా లేఖలే రాశారు. మొదటి నుండీ సంచలనాలకు కేరాఫ్ అయిన వీకే సింగ్ అటు జైళ్ళ శాఖలో పని చేసిన సమయంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు .పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు.

 పదోన్నతి విషయంలోనూ ప్రభుత్వానికి లేఖ

పదోన్నతి విషయంలోనూ ప్రభుత్వానికి లేఖ

ఇక మరోమారు తాను పదోన్నతికి పనికిరానా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు . జైళ్ల శాఖ డీజీ గా ఉన్నప్పుడు ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్లే ఆయన తీరుతో ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా ఆయనను నియమించింది . గతంలో మీడియా పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక మీడియా ఛానల్ పైన కేసు పెట్టారు.

వీకే సింగ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్

వీకే సింగ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్

అదనపు డీజీగా ఉన్న తనకు నిబంధనల ప్రకారం డీజీగా ఎందుకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తాను పదోన్నతి పనికిరాను అని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీకే సింగ్ లేఖ రాశారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటూ ప్రభుత్వానికి రిటైర్ చెయ్యాలని మరో లేఖ రాశారు . దీనిపై ప్రభుత్వం ఆయనకు షాక్ ఇస్తూ ఆయన వీఆర్ఎస్ ను రద్దు చేసింది .

  Rhea Chakraborty Granted Bail by Bombay High Court రియా చక్రవర్తి ఇక సేఫ్...!! || Oneindia Telugu
  వీకే సింగ్ పై ఉన్న కేసుల దర్యాప్తు .. సీరియస్ యాక్షన్ తీసుకోనున్న సర్కార్ ?

  వీకే సింగ్ పై ఉన్న కేసుల దర్యాప్తు .. సీరియస్ యాక్షన్ తీసుకోనున్న సర్కార్ ?

  పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే జూన్ 26వ తేదీన ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఎస్‌ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆయన పై బదిలీ వేటు వేసింది. స్టేట్‌ పోలీస్‌ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌ ను అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్‌ రాజీనామాకు సిద్దపడ్డారు. వీకే సింగ్ పై తెలంగాణ ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. పోలీస్ వ్యవస్థ పై విమర్శలు గుప్పించడంతో పాటుగా తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడిన వికె సింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లుగా సమాచారం. అక్రమ కలప స్మగ్లింగ్ పై విచారణ చేపట్టి వీకే సింగ్ పాత్ర ఏమిటో తేల్చాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టుగా సమాచారం.

  English summary
  The Telangana government has rejected the file to the voluntary retirement of VK Singh, a senior IPS officer who worked director of the Police Academy. On Gandhi Jayanti day, the Telangana government rejected his file request for VRS . It has said that a departmental inquiry is underway in two cases against VK Singh and that's why currently canceling his VRS. A notice was sent to him on October 2 denying his request to this extent.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X