హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త సచివాలయ నిర్మాణానికి స్పీడ్ పెంచిన తెలంగాణా సర్కార్ ...రూ. 400 కోట్లు మంజూరు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి శరవేగంగా అడుగులు వేస్తుంది . ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తెలంగాణా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించారు . పాత సచివాలయం స్థానంలో కొత్త హంగులతో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ పనిని త్వరితగతిన పూర్తిచేయాలని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడుతుంది.

కొత్త సచివాలయం నిర్మాణానికి నాలుగు వందల కోట్ల మంజూరు

కొత్త సచివాలయం నిర్మాణానికి నాలుగు వందల కోట్ల మంజూరు


కొత్త సచివాలయ నిర్మాణానికి స్పీడ్ పెంచిన తెలంగాణా సర్కార్ అందులో భాగంగా తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సచివాలయ నూతన భవన నిర్మాణానికి ఆమోద ముద్ర వేసి, కొత్త డిజైన్లను ఓకే చేసింది. ఇక అంతే కాదు కొత్త సచివాలయం నిర్మాణానికి నాలుగు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు వెల్లడించింది. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో కూడా సచివాలయం నిర్మాణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

పక్కా వాస్తుతో ఏడు అంతస్తులుగా సచివాలయ భవనం

పక్కా వాస్తుతో ఏడు అంతస్తులుగా సచివాలయ భవనం

మొదట ఆరు అంతస్తులుగా నిర్మించాలని భావించినా , సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని ఏడంతస్తులకి పెంచారు. అందుకనుగుణంగా డిజైన్ కూడా మార్చారు. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ కార్యాలయం ఉండనున్నట్లుగా తెలుస్తుంది. కొత్త సచివాలయం తూర్పు అభిముఖంగా, పక్క వాస్తు ప్రకారం ఉండనుంది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ లు ఆస్కార్ అండ్ పొన్ని సంస్థ తయారుచేసిన డిజైన్ ను ఆమోదించి నిర్మాణం చేపట్టనున్నారు.

Recommended Video

V Hanumantha Rao Slams TRS Govt డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా ప్రభుత్వ భూములు అంటూ ఆక్రమణ !
సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షలు .. శరవేగంగా అడుగులు

సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షలు .. శరవేగంగా అడుగులు


సీఎం కేసీఆర్ సచివాలయ భవనం నమూనాపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. కొత్త సచివాలయం నిర్మాణం పై తరచూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గంటల తరబడి సచివాలయ నిర్మాణంపై సమీక్షలు చేస్తున్నారు . కొత్త సచివాలయం నిర్మాణానికి ఆమోద ముద్ర వేయడంతో పాటుగా నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో ఆర్ అండ్ బి శాఖ పరిపాలనాపరమైన అనుమతులను ఇవ్వనుంది. ఒకటి రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది.

English summary
Telangana Government has speed up the construction of a new Secretariat. The government today also sanctioned Rs 400 crore for the construction of a new secretariat. CM KCR is very ambitious to build a new secretariat. The cabinet meeting also discussed the structure of the secretariat and gave green signal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X