హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం చర్యలు తీసుకుంటున్నారు?: కరోనాపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. కరోనా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి, లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని స్పష్టం చేసింది.

క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి వసతులు, చికిత్స ఇస్తున్నారో చెప్పాలని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పీఎల్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్ అనే వ్యక్తులు దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

 telangana HC orders govt to explain the steps taken to prevent coronavirus spread.

వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ కిట్లు, పీపీఈ, ఎన్-95 మాస్కులు ఉన్నాయా? ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఇలావుండగా, కరోనా నేపథ్యంలో చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్‌లో పిల్లల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని ఆదేశించింది.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరోనావైరస్‌ వివరాలను వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 45 మందిని డిశ్చార్జ్ చేశాం. 11 మంది చనిపోయారు.
ప్రస్తుతం 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు. విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేశాం, అందులో 50కి మాత్రమే పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి.. వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది. మర్కజ్ నుంచి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి అంటించారని తెలిపారు.

జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ పాటిస్తున్నాం. 22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ చేశాయి.
జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి. లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని తాను ప్రధానికి చెప్పానని కేసీఆర్ తెలిపారు.

మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇది. లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు. రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారు.
శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.

English summary
telangana HC orders govt to explain the steps taken to prevent coronavirus spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X