హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఓకే, అభ్యంతరకర కామెంట్స్ చేయొద్దని షరతు

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. నిన్న నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల కామెంట్స్ చేయడం.. టీఆర్ఎస్ శ్రేణులు దాడికి తెగబడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షర్మిల కారు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఇవాళ అదే కారుతో ప్రగతి భవన్ ముట్టడించేందుకు షర్మిల ట్రై చేయడం.. పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్మిల ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఉన్నారు. ఆమెను కలిసేందుకు తల్లి విజయమ్మ వచ్చారు. అలాగే భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా వచ్చారు.

 హైకోర్టు ఓకే..

హైకోర్టు ఓకే..

వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. సీఎం కేసీఆర్‌పై రాజకీయ పర, మతపర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు షరతు విధించింది. షర్మిల పాదయాత్రకు అనుమతించాలని వైఎస్సార్టీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

పోలీసులు పర్మిషన్ ఇవ్వలే

పోలీసులు పర్మిషన్ ఇవ్వలే


3,500 కిలో మీటర్ల మేర షర్మిల పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే విషయాన్నివైఎస్ఆర్ టీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది. షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్ఎస్ అంటే..

బీఆర్ఎస్ అంటే..


అంతకుముందు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నది గూండాలు...రౌడీలేనని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. పోలీసుల అనుమతితో పాదయాత్ర చేస్తున్నా.. అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమపై దాడులు చేసి.. వాహనాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు.

English summary
telangana high court agree to ys sharmila padayatra but conditions apply. donot comments against cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X