హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో టపాసుల అమ్మకాలు, కాల్చడంపై నిషేధం: హైకోర్టు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు దీపావళి టపాసులు కాల్చడం, అమ్మడంపై నిషేధాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీపావళి సందర్భంగా తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిసేధం విధించింది.

కరోనా కారణంగా రాష్ట్రంలో నిషేధం విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ రోజు కేవలం 2 గంటలపాటు మాత్రమే పటాకులను కాల్చుకునే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

 Telangana High Court bans firecrackers sales in state.

Recommended Video

Karnataka Joins Delhi, Odisha, Diwali Crackers పై నిషేధం!! | Oneindia Telugu

దేశంలోని రాజస్థాన్, ఢిల్లీ, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కొన్ని రాష్ట్రాలు కొంత సమాయానికే పరిమితం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి. టపాసుల పొగ ద్వారా శ్వాసకోశ సమస్యలు వచ్చి కరోనా ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.

English summary
Telangana High Court bans firecrackers sales in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X