హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షరతులు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు రాయితీపై ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోండి:తెలంగాణా హైకోర్టు

|
Google Oneindia TeluguNews

ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో తెలంగాణ హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తెలంగాణా సర్కార్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. మితిమీరి ప్రవర్తించే ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయడమే కాదు, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భూములు ఇచ్చినా వాటిని తిరిగి వెనక్కు తీసుకోవాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై పిటీషన్ విచారణ

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై పిటీషన్ విచారణ

ప్రైవేట్ ఆస్పత్రులలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అపోలో, బసవతారకం హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటీషన్ ను తెలంగాణ హై కోర్టు విచారించింది.

రాయితీకే భూములు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు బేఖాతరు

రాయితీకే భూములు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు బేఖాతరు


కనీసం కొందరికైనా నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆసుపత్రులకు భూములు కేటాయించిందని, ప్రభుత్వ భూములు తీసుకున్న ఆసుపత్రులు సైతం ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, అధిక ఫీజులు వసూలు చేస్తూ పీడిస్తున్నాయని పిటిషనర్ ఓఎం దేబరా కోర్టులో తమ వాదన వినిపించారు.
ప్రభుత్వం నుండి రాయితీ ధరలకే భూములు పొందిన అపోలో ,బసవతారకం ఆసుపత్రులు పేదలకు ఉచితంగా వైద్యం ఇవ్వలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.

 ఆ ఆస్పత్రుల భూములు ఎందుకు వెనక్కి తీసుకోవటం లేదని హైకోర్టు ప్రశ్న

ఆ ఆస్పత్రుల భూములు ఎందుకు వెనక్కి తీసుకోవటం లేదని హైకోర్టు ప్రశ్న


దీంతో ధర్మాసనం ప్రభుత్వం విధించిన షరతులను ఉల్లంఘిస్తున్న ఆస్పత్రుల భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించకుంటే మృతదేహాలను కూడా అప్పగించకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ప్రభుత్వానికి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్ పెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.

Recommended Video

Telangana లో కరోనా ఉప్పెన, 2013 మందికి పాజిటివ్ | Telangana Corona Update || Oneindia Telugu
ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి భూములు ఇచ్చినా వాటిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అపోలో, బసవతారకం ఆసుపత్రులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.

English summary
The Telangana High Court has once again expressed outrage that private hospitals are charging high fees. It has directed the government to take strict action against private hospitals that are charging high fees. Commented that it was not sufficient to revoke the licenses and to take back the lands. ordered the government to give an explanation on the Apollo, Basava Tarakam hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X